మల్టీ లెవెల్ మార్కెంటింగ్ పేరుతో యువతులకు వల..పైసా వసూళ్లు..లైంగిక వేధింపులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో హైదరాబాద్ లో మరో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. వ్యాపారం పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేసి మోసాలకు పాల్పడుతున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారం పేరుతో అమ్మాయిలకు ఎర వేసిన అనంతరం వారిని బెదిరిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నా ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు.
వ్యాపారం అంటూ అమ్మాయిల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి అనంతరం వారిని బెదిరిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు కొంతమంది కేటుగాళ్ళు. దీనిపై బాధిత యువతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం నలుగురు యువలకులను అరెస్ట్ చేసింది.గతంలో పరిచయమైన అమ్మాయిలు..ఫ్రెండ్స్..ఫ్యామిలీస్..పార్టీలు..ఈవెంట్ల ద్వారా అమ్మాయిలను పరిచయాలను చేసుకోవటం వారితో ఫ్రెండ్షిప్ చేయటం..తరువాత వారిని వ్యాపారం పేరుతో మోసాలు చేయటం ఇదీ ఉదయ్,జీవన్,మలాన్,దీక్షిత్ అనే యువకులు చేసే పని. బ్రాండెడ్ డ్రెస్సింగ్స్ ..ఖరీదైన కార్లలతో తిరిగుతూ..ఈవెంట్లు చేయటం వాటికి తెలిసిన అమ్మాయిలను పిలవటం తద్వారా పరిచయాలు పెంచుకుని రంగంలోకి దింపుతారు వీరు నలుగురు. ఆ తరువాత మల్టీ లెవల్ మార్కెటింగ్ అనే కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేస్తా భారీగా లాభాలు పొందవచ్చంటూ అమ్మాయిలను నమ్మిస్తారు.అమ్మాయిల్నే టార్గెట్ గా చేసుకుని మోసాలకు పక్కా ప్లాన్ వేశారు. దీంతో వీరి ట్రాప్ లో పలువురు యువతులు పడగా వారి నుంచి రూ.50లక్షలు వసూలు చేశారు. అనంతరం తాము ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు సంబంధించి ఎంతకీ ఫ్రాఫిట్స్ రాకపోవటంతో సదరు యువకుల్ని బాధిత యువతులు ప్రశ్నించారు. నిలదీశారు. దీంతో వారి అసలు రంగు బైటపడింది. డబ్బులు ఇవ్వకపోగా సదరు యువతులను బెదిరిస్తూ లైంగిక వేధింపులకు తెగబడ్డారు సదరు మోసగాళ్లు.. దీంతో బాధిత యువతులు హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించగా రంగంలోకి దిగిన పోలీసులు సదరు నలుగురు యువకులను అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకుని మియాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Related Posts