లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Hyderabad

హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారనుంది: తమిళి సై

Published

on

Hyderabad: గవర్నర్ తమిళిసై సుందర్‌రాజన్ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం పలు పనులను ఫాస్ట్ ట్రాక్ లో నడిపిస్తూ.. హైదరాబాద్ ను మెట్రోపాలిటన్ సిటీ నుంచి ఇంటర్నేషనల్ మెట్రోపోలీస్ గా ఎదుగుతుందంటూ అభవర్ణించారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ పరిధిలోని 111ప్రదేశాల్లో ఉండే పేదలకు లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించే గొప్ప పనిలో ఉన్నారు. నిర్మాణాలు పూర్తి అయిన కొన్ని ప్రదేశాల్లో కొందరికి ఇప్పటికే ఇచ్చేశారు కూడా.

పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన 72వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్న గవర్నర్.. లాక్ డౌన్ పీరియడ్ లో పూర్తి స్థాయిలో రోడ్ పనులు, బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. హైదరాబాద్ లో దాదాపు 250కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు వేసినట్లు వివరించారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఫాస్ట్ ఫేజ్ ను ప్రోగ్రెస్ చేయడంతో పాటు 26మెయిన్ రోడ్లను విస్తరించే పనిలో పడ్డారు. మెయిన్ జంక్షన్లు పెంచడం వల్ల ట్రాఫిక్ సిగ్నల్ పడకుండా స్మూత్ గా వెళ్లగలుగుతున్నారు.

ఇందులో భాగంగానే 11స్కై వేస్, 11మేజర్ కారిడర్స్, 68 మేజర్ రోడ్స్, 54గ్రేడ్ సపరేటర్స్ అన్నీ నిర్మించారని అన్నారు. భారత్ స్వచ్ఛ మిషన్ కింద చార్మినార్ పెడస్ట్రియన్ ప్రొజెక్ట్ చేపట్టడం గర్వించదగ్గ విషయం అన్నారు. దుర్గం చెరువు దగ్గర కేబుల్ బ్రిడ్జ్ కట్టడం వల్ల ట్రాఫిక్ తగ్గడమే కాకుండా మేజర్ టూరిస్ట్ స్పాట్ గా కూడా మారిందని అన్నారు.