Home » భార్య బ్రతకదనే ఆవేదనతో..రక్తంతో లెటర్ రాసి ఉరివేసుకున్న భర్త
Published
1 week agoon
Hyderabad Shamirpet husband commits suicide : కాపురం అన్నాక భార్యా భర్తలు గొడవలు పడటం మామూలే. కానీ..ఆ గొడవలను సర్ధుబాటు చేసుకోలేక పచ్చని కాపురంలో ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాల్లో విషాదాలను నింపుకుంటున్న ఘటనలో ఎన్నో జరుగుతున్నాయి. అలా ఓ భార్య కుటుంబంలో వచ్చిన వివాదాలు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో భర్త వెంటనే భార్యను హాస్పిటల్ లో చేర్చి చికిత్సనందిస్తున్నాడు.
ఈక్రమంలో భర్త తన భార్య బ్రతకదేమోననే ఆందోళనతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు తన ‘రక్తంతో లెటర్ రాసి’ మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం (జనవరి 11,2021) వెలుగు చూసింది.
శామీర్‌పేట మండలం మజీద్‌పూర్ గ్రామ పరిధిలోని మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకొని మృతిచెందిన వ్యక్తిని గమనించిన స్థానికుడి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. సదరు మృతుడు ఎవరు? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అనే కోణంలో సీఐ సంతోశ్, ఎస్ఐ గణేశ్ సిబ్బందితో కేసు దర్యాప్తు చేపట్టారు.
దీంట్లో భాగంగా మృతదేహానికి పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. శవ పంచనామా పూర్తి అయిన తరువాత సదరు వ్యక్తి ఉరివేసుకొని మృతి చెందిన వ్యక్తిని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పిట్ల నవీన్ అనే 26 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఆత్మహత్యాయత్నం చేసిన భార్య..రక్తంతో లేఖ రాసిన భర్త ఆత్మహత్య
నవీన్ ఇంట్లో గత కొంతకాలంగా భార్యాభర్తలిద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయి. దీంతో నవీన్ భార్య రెండు రోజుల క్రితం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఆమెను చికిత్స నిమిత్తం నగరంలోని ఓ హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు.
రక్తంతో లేఖ రాసి ఆత్మహత్య
ఈక్రమంలో తన భార్య తనకు దక్కదనే ఆందోళనతో ఆమెను కాపాడలేకపోతున్నానని రాసిన లెటర్ ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో పోలీసులకు లభించింది. నవీన్ తన చేతికి గాయం చేసుకుని రక్తంతో “నిన్ను నేను కాపాడుకోలేక పోతున్నాను” అనే సారాంశం వచ్చే విధంగా రాసినట్లుగా తెలుస్తోంది. భార్య ఇక తనకు దక్కదనే ఆవేదన..తన ముందే భార్య ఆత్మహత్య చేసుకున్నా.. కాపాడలేకపోతున్నాననే మనోవేదనే నవీన్ ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న శామీర్ పేట పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.