-
Home » పవన్ సజీవదహనం కేసు.. పక్కా ప్లాన్ ప్రకారం భార్యే చంపింది
Crime
పవన్ సజీవదహనం కేసు.. పక్కా ప్లాన్ ప్రకారం భార్యే చంపింది
Published
2 months agoon
By
naveen
Hyderabad techie burnt alive: అదే నిజమైంది. పవన్ కుటుంబసభ్యుల ఆరోపణలు వాస్తవమని తేలాయి. పక్కా ప్లాన్ ప్రకారం కుటుంబసభ్యులతో కలిసి భార్యే…భర్తను సజీవదహనం చేసినట్లు నిర్ధారణ అయింది. హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు ఆమె వేసిన ప్లాన్ బెడిసికొట్టి అడ్డంగా బుక్కైంది. మరి భర్తను చంపాల్సిన అవసరం ఆమెకు ఎందుకొచ్చింది..? బావమరిది మరణానికి అతడే కారణమా..? అసలు ఆ కుటుంబంలో ఏం జరిగింది..?
పథకం ప్రకారమే సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్య.. సజీవదహనం వెనుక పవన్ భార్య కృష్ణవేణి.. కుటుంబసభ్యులతో కలిసి భర్తను చంపిన భార్య.. కృష్ణవేణి సహా ఏడుగురిపై కేసులు నమోదు..హత్య కేసులో ఐదుగురు మహిళా నిందితులు.. పవన్ హత్యలో మరికొంతమంది ప్రమేయం.
కుటుంబసభ్యులతో కలిసి భర్తను చంపిన భార్య:
సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ పవన్ సజీవదహనం కేసులో మిస్టరీ వీడింది. జగిత్యాల జిల్లా బల్వంతపూర్ శివార్లలో జరిగిన హత్య కేసులో భార్య కృష్ణవేణి పాత్ర ఉన్నట్లు తేల్చారు పోలీసులు. తన సోదరుడు, మరదలు కలిసి తన భర్తను చంపేశారని కృష్ణవేణి నమ్మించే యత్నం చేసింది. కానీ.. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లు మాల్యాల పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో మృతుడి పవన్ భార్య కృష్ణవేణి సహా…ఆమె కుటుంబసభ్యులు, సమీప బంధువులు మొత్తం ఏడుగురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
ఆరు తులాల ఆభరణాలు చోరీ, జగన్ దొంగలించాడని పవన్ అనుమానం:
హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన సాప్ట్వేర్ ఉద్యోగి పవన్‌కు జగిత్యాల జిల్లా బల్వంతపూర్‌కు చెందిన కృష్ణవేణితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. కృష్ణవేణికి విజయ్, జగన్ ఇద్దరు సోదరులు ఉన్నారు. అయితే…కృష్ణవేణి ఏడాది క్రితం ఆదిలాబాద్‌కు.. బంధువుల ఇంటి పెళ్లికి వెళ్లింది. ఆ సమయంలో ఆరు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. అప్పట్నుంచి భార్యతో పవన్ తరచూ గొడవపడేవాడని తెలిసింది. ఆ ఆభరణాలను బావమరిది జగన్ దొంగిలించాడన్న అనుమానంతో అతన్ని దూషించేవాడని, చంపుతానని బెదిరించేవాడని తెలిసింది.
గుండెపోటుతో జగన్ మృతి, పవన్ క్షుద్రపూజలు చేయించడం వల్లే అని ఆరోపణ:
సీన్ కట్ చేస్తే…ఇటీవల కృష్ణవేణి రెండో సోదరుడు జగన్ గుండెపోటుతో మృతి చెందాడు. అయితే పవన్ క్షుద్రపూజలు చేయించడం వల్లే జగన్ చనిపోయాడని…కృష్ణవేణి మరో సోదరుడు విజయ్‌స్వామి తన కుటుంబసభ్యులకు నూరిపోశాడు. అంతకుముందే బంగారం విషయంలో గొడవలు పడుతుండటం…ఇప్పుడు సోదరుడిని చంపాడనే అనుమానం..వెరసి కృష్ణవేణి తన భర్తపై మరింత కోపం పెంచుకుంది. కృష్ణవేణితో పాటు ఆమె కుటుంబసభ్యులంతా కోపం పెంచుకున్నారు. ఎలాగైనా పవన్‌ను అంతమొందించడానికి కృష్ణవేణి, విజయ్స్వామిలతో పాటు ఆమె మరదలు సుమలత, అక్క స్వరూప, అమ్మ ప్రమీల పథకం రూపొందించారు.
నివాళి అర్పించేందుకు వచ్చిన పవన్ సజీవదహనం:
సోమవారం జగన్ దశదిన కర్మ నిర్వహించారు. దీనికి కృష్ణవేణి రెండు రోజుల ముందుగానే పుట్టింటికి చేరుకుంది. సోమవారం సాయంత్రం సమయంలో బావ మరిది ఇంటికి చేరుకున్నాడు పవన్. వచ్చి రాగానే జగన్ భార్యతో పాటు కుటుంబసభ్యులను పరామర్శించి.. గదిలో ఉన్న జగన్ చిత్ర పటం దగ్గర నివాళులు అర్పించేందుకు వెళ్లాడు. అప్పటికే చంపేయాలనే ప్లాన్‌లో ఉన్న కృష్ణవేణి కుటుంబసభ్యులు…గదిలో జగన్ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్న సమయంలో తలుపులు మూసి, బయట నుంచి తాళం వేశారు. ఆ తర్వాత కృష్ణవేణితో పాటు సమీప బంధువులు, కొండగట్టుకు చెందిన నిరంజన్‌రెడ్డి అనే ఓ యువకుడు కలిసి గది కిటికీ, జాలీలలో నుంచి పెట్రోలు పోసి నిప్పంటించారు.
భార్యే చంపిందని పవన్ కుటుంబసభ్యుల ఆరోపణ:
ఆ తర్వాత హత్య కేసు తనపై రాకుండా కృష్ణవేణి మరో పథకం వేసింది. సోదరుడు విజయ్, మరో సోదరుడి భార్య సుమలతతో పాటు కుటుంబసభ్యులంతా కలిసి తన భర్తను చంపేస్తున్నారంటూ…పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే పవన్ సజీవదహనమయ్యాడు. అయితే మొదటి నుంచి పవన్ తల్లిదండ్రులు, బంధువులు…కృష్ణవేణితో పాటు ఆమె కుటుంబసభ్యులపైనే అనుమానం వ్యక్తం చేశారు. పవన్‌కు కృష్ణవేణితో పాటు, బావమరుదలతోనూ గొడవలు ఉండేవని..ఆ గొడవల నేపథ్యంలోనే…అంతా కలిసి పక్కా ప్లాన్ ప్రకారమే హతమార్చారని ఆరోపించారు.
కృష్ణవేణి సహా ఏడుగురిపై కేసులు:
ఘటనాస్థలిని పరిశీలించిన ఎస్పీ సింధూశర్మ, డీఎస్పీ వెంకటరమణ, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు. మృతుడు పవన్ తండ్రి గంగాధర్‌తో పాటు అంతకుముందు భార్య కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం…పవన్ సజీవదహనం భార్య పన్నాగమే అని తేల్చారు. ప్రస్తుతానికి కృష్ణవేణి, ఆమె అన్న విజయ్‌స్వామి, మరదలు సుమలత, అక్క స్వరూప, తల్లి ప్రమీల, సమీప బంధువులు మొత్తం ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. పవన్ భార్య కృష్ణవేణి ఏ 3 నిందితురాలు కాగా… పవన్ బావమరిది జగన్ భార్య సుమలత ఏ1గా.., పవన్ పెద్ద బావమరిది విజయ్ ఏ2గా..,కృష్ణవేణి తల్లి ప్రమీల ఏ4గా..,సోదరి స్వరూప ఏ5గా తేల్చిన పోలీసులు…ఈ కేసులో మిగతా ఇద్దరు నిందితులు భవానీని ఏ6గా, నిరంజన్‌రెడ్డిని ఏ7గా గుర్తించారు. ఇక ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న మాల్యాల పోలీసులు..ఆ దిశగానూ దర్యాప్తు ముమ్మరం చేశారు.
కృష్ణవేణి సాధించింది ఏంటి?
సంసారం అన్నాక ఏదో ఒక గొడవలు రావడం కామన్. గొడవలు వచ్చినప్పుడు ఎలా పరిష్కారించుకోవాలో ఆలోచించాలి. అంతేకానీ గొడవలు పెడుతున్నాడని భర్తపై కోపం పెంచుకుని ప్రాణాలు తీసి ఆ ఇల్లాలు సాధించిందేంటి? తన జీవితాన్ని నాశనం చేసుకోవడమే… అంతేకాదు మరెందరో జీవితాలను నడిరోడ్డున పడేసింది.

బైడెన్ అనే నేను.. 46వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం

బైడెన్, హారిస్ ప్రమాణస్వీకారం వేళ : అమెరికా సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపు

టీడీపీ నేత కళా వెంకట్రావు అరెస్టు

ఎస్ఐ విజయ్ ఆత్మహత్య కేసులో రిమాండ్‌కు ప్రియురాలు

ఏడాదిన్నరపాటు వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేత

సింగర్ శ్రేయా ఘోషల్ ఫొటోస్

కామ్మా జెఠ్మలానీ ఇప్పుడూ అలానే ఉంది!

అల్లరి పిల్ల అనుపమా పరమేశ్వరన్ ఫొటోస్

తెలుగు అందం రీతూ వర్మ ఫొటోస్

కాజల్ ఎంజాయ్ మామూలుగా లేదుగా!

పడిలేచిన కెరటం..జో బైడెన్ ప్రయాణం

రోజా కష్టాల వెనుక కారణమేంటి ?

తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే..

కరోనా పుట్టింది ఇక్కడే.. గుహలో చైనా శాస్త్రవేత్తలపై గబ్బిలాల దాడి
