-
Home » చికెన్ వెరైటీల్లో హైదరాబాదే టాప్ : రోజుకు 6 లక్షల కిలోలు తినేస్తున్న నగరవాసులు
Hyderabad
చికెన్ వెరైటీల్లో హైదరాబాదే టాప్ : రోజుకు 6 లక్షల కిలోలు తినేస్తున్న నగరవాసులు
Published
2 months agoon

Hyderabad tops in chicken dish varieties in the India : నాన్ వెజ్ లో మీకేది ఇష్టమని మాంసాహారుల్ని అడిగితే ఠక్కుమని చెప్పేది ‘చికెన్’. వందల రకాల చికెన్ వెరైటీలను లాగించేయటమంటే నాన్ వెజ్ ప్రియులకు భలే భలే ఇష్టం. ముఖ్యంగా బిర్యాని అంటే ఠక్కున గుర్తుకొచ్చే మన హైదరాబాద్ వాసులకు చికెన్ అంటే మరీ మరీ ఇష్టం. సండేనే కాదు మామూలు రోజుల్లో కూడా ముక్కలేందో ముద్ద దిగనివాళ్లు ఎంతో మంది. అలా మన హైదరాబాద్ వాసులు రోజుకు ‘6లక్షల కిలోల చికెన్’ తినేస్తున్నారట. చికెన్ తో వెరైటీ వెరైటీ రెసిపీలు తయారుచేయటంలో మన హైదరాబాద్ టాప్ లో ఉంది. దీంతో భాగ్యనగరవాసులు రోజుకు 6 లక్షల కిలోల చికెన్ లాగించేస్తున్నారు. దీంతో చికెన్ లవర్స్‌కు హైదరాబాద్ అడ్డాగా మారుతోంది.
టిఫిన్.. లంచ్.. స్నాక్స్.. డిన్నర్ సమయం ఏదైనా.. చికెన్ వంటకాల్ని భాగ్యనగరవాసులు తెగ కుమ్మేస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గుతున్న క్రమంలో ఈ మధ్య నెలల్లో అంటే నవంబర్, డిసెంబర్ నెలలో చికెన్ వాడకంలో దేశంలోనే హైదరాబాద్ నగరం మొదటి స్థానంలో ఉందని తేలింది. గ్రేటర్ జనానికి ఎదైనా ముక్క లేనిదే ముద్ద దిగడంలేదని తేలింది.
చికెన్ తినటంతో దేశంలోనే హైదరాబాద్ టాప్ లో ఉంటే దేశరాజధాని ఢిల్లీ రెండో స్థానం ఉంది. బెంగళూరు మూడోస్థానంలో ఉంది. చికెన్ లో పోషక విలువలు, ప్రొటీన్స్ ఎక్కువగా ఉండటంతో పైగా మటన్ కంటే చికెన్ ధర తక్కువగా ఉండటంతో అన్ని ఆదాయ వర్గాల వారికీ అందుబాటులో ఉండటంతో చికెన్‌కు రోజురోజుకూ గిరాకీ పెరుగుతోంది. కరోనా తో ఇమ్యూనిటీ పెంచుకోవటానికి చికెన్ అమ్మకాలు భారీగా పెరిగాయనే చెప్పాలి. ఇక మటన్ విషయానికి వస్తే దాని ధర వల్ల పెద్దగా పెరగలేదని నాన్‌వెజ్ మార్కెట్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి.
చికెన్ వెరైటీల్లోనూ హైదరా‘బాద్షా’గా మారింది. ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోన్న సిటీవాసులు ఆన్‌లైన్‌లోనూ తమకు నచ్చిన చికెన్ వెరైటీలను ఆర్డర్లు చేస్తున్నారని ఫుడ్ డెలివరీ సంస్థల సర్వే ద్వారా తెలిసింది. దేశంలోని ఇతర నగరాలతో పోలీస్తే ప్రపంచ వ్యాప్తంగా లభించే వివిధ రకాల చికెన్ డిష్‌లు దాదాపు నగరంలోని అన్ని హోటల్స్‌లో లభిస్తున్నాయి.
దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలీస్తే హైదరాబాద్ హోటల్స్‌లో చికెన్‌తో చేసిన దాదాపు ఇరవైకి పైగా వెరైటీలు లభిస్తున్నాయని తేలింది. దీంతో కూడా నగరవాసులు వివిధ రకాల చికెన్ వెరైటీల రుచులు ఆస్వాదిస్తున్నారు. వెరైటీ చికెన్ ఆడర్స్లోనూ దేశంలోనే హైదరాబాద్ నంబర్ వన్‌గా ఉందని ఫుడ్ డెలివరీ సంస్థలు తెలిపాయి. హైదరాబాద్‌లో పురాతన కాలంనుంచే భోజన ప్రియులు ఉండటంతో ఇక్కడ అందుబాటులో ఉన్న ఫుడ్ వెరైటీలు దేశంలో ఎక్కడా లేవని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు.
గ్రేటర్లో ప్రతీరోజు 6 లక్షల కిలోలు వాడకం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు 6 లక్షల కిలోల చికెన్ వాడకం ఉంది. ఇది దేశంలోనే అత్యధికం. ఢిల్లీ, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లో చికెన్ వాడకం చాలా ఎక్కువగా ఉందని జాతీయ పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. కోవిడ్ తరువాత గ్రేటర్లో రోజూ 6 లక్షల కిలోల వినియోగం ఉండగా ఢిల్లీలో 5.5 లక్షలు, బెంగళూరులో 5 లక్షల వరకు చికెన్ విక్రయాలు జరుతున్నాయని పౌల్ట్రీ రంగం అంచనా వేసింది.
ఇతర నగరాలతో గ్రేటర్లో చికెన్ ధరలు కూడా తక్కువేకావటం వల్ల కూడా హైదరాబాద్ లో చికెన్ వాడకం ఎక్కువగా ఉండటానికి కారణంగా తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు కోళ్ల ఎగుమతులు బాగా జరుగుతున్నాయి.
చికెన్ 6 లక్షల కిలోలు ఉంటే మటన్ లక్ష కేజీలు మాత్రమే..
గ్రేటర్లో చికెన్ విక్రయాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నా మటన్ విక్రయాలు మాత్రం పెద్దగా లేవు. రోజుకు హైదరాబాద్ పరిధిలో మటన్ విక్రయాలు లక్ష కేజీల దాటడం లేదు. చికెన్‌తో పోలీస్తే మటన్ ధర ఎక్కువగా ఉండం దీనికి కారణం. కేజీ మటన్ ధరలో మూడు కేజీల చికెన్ లభిస్తోంది. దీంతో చికెన్ వాడకం ఎక్కువగా ఉంది. చికెన్, మటన్ కాకుండా ఇతర నాన్‌వెజ్ విషయానికి వస్తే చేపలు, రొయ్యల వినియోగం ఈ కోవిడ్ తరువాత పెరిగిందని నాన్ వెజ్ వర్గాలు చెబుతున్నాయి.
You may like
-
ఉచిత మంచి నీరు అందేనా ? ఇబ్బందిగా మారిన ఆధార్ లింక్
-
నేను పార్టీ పెట్టడం అన్నకు ఇష్టం లేదు: షర్మిల
-
మూడవ టెస్ట్‌లో భారత్ ఆధిపత్యం.. ఇంగ్లాండ్ ఆలౌట్!
-
రూ.20 వేలు ఇవ్వాలంటే రూ.5 వేలు లంచం…..ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి
-
బీఎండబ్యూ కొత్త బైక్.. కళ్లు చెదిరే ధర.. ఎంతో తెలుసా?
-
బీ.ఫార్మశీ విద్యార్ధిని బలవన్మరణంలో గత రెండు వారాలుగా ఎప్పుడేం జరిగింది

ఉచిత మంచి నీరుపై గ్రేటర్ వాసులు అయోమయం

బైడెన్ మరో కీలక నిర్ణయం.. గ్రీన్ కార్డు అప్లికేషన్స్‌పై నిషేధం ఎత్తివేత

కరోనా వ్యాక్సిన్లు అద్భుతంగా పనిచేస్తున్నాయి.. అసలు వాస్తవాలివిగో!

రైలు టిక్కెట్లపై ఛార్జీల బాదుడు.. ప్రయాణాలు తగ్గించడం కోసమే: రైల్వే మినిస్ట్రీ

అసలు ఈ కరోనా మహమ్మారి ఎప్పుడు, ఎలా అంతమైపోతుందంటే?

పరువాల పూనమ్ బజ్వా ఫొటోస్

‘ఉప్పెన’ సక్సెస్ సెలబ్రేషన్స్..

అనన్య నాగళ్ల ఫొటోస్

ప్రగతి ఫొటోలు చూశారా!

‘లీడర్’ హీరోయిన్ ప్రియా ఆనంద్ ఫొటోస్

ఉచిత మంచి నీరుపై గ్రేటర్ వాసులు అయోమయం

బంగారంతో బిర్యానీ

కేరళ, తమిళనాడు, బెంగాల్లో బీజేపీకి అగ్నిపరీక్ష

‘ఎవరు మీలో కోటీశ్వరుడు’..హోస్ట్‌గా ఎన్టీఆర్
