లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Hyderabad

నాలుగు పెళ్లిళ్లు చేసుకుని..ఆరుగురితో సహజీవనం : జల్సా భర్తకు ఝలక్ ఇఛ్చిన నాలుగో భార్య

Published

on

Hyderabad man four marriges wife case filed : పెళ్లంటే బొమ్మల పెళ్లి అనుకున్నాడో జల్సా పురుషుడు. ఏకంగా ఒకటీ రెండూ కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అక్కడితో ఈ పూలరంగడి బాగోతాలు ఆగలేదు. మరో ఆరుగురు మహిళలతో సహజీవనం కూడా సాగించాడు. ఈ జల్సాలుచేస్తునే మరోపక్క కట్టుకున్న పెళ్లాలకు నరకం చూపించేవాడు.దీంతో నాలుగో భార్య సదరు జల్సారాయుడిపై ఫిర్యాదు చేయటంతో వీడి పెళ్లిళ్ల బాగోతాలు..సహజీవనం చేస్తున్న వైనాలు నాలుగో భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో బైటపడ్డాయి.నేను దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నా..రెండు చేతులా సంపాదిస్తున్నానని చెప్పి నాలుగు పెళ్లిళ్లు చేసుకోవటమే కాకుండా మరో ఆరుగురు మహిళలతో సహజీనం చేస్తున్న బండారం ఎట్టకేలకు నాలుగో భార్య ధైర్యంచేసి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ నిత్య పెళ్లికొడుకు బండారం బైటపడింది. దుబాయ్ లో మాంచి సంపాదన ఉందని మోసం చేసి మ్యాట్రీమోనీ సైట్ లో మహిళల్ని నమ్మించి పెళ్లి మీద పెళ్లి చేసుకోవటం వాళ్లను వదిలించుకుని మరో పెళ్లికి సిద్ధపడటం వీడి అలవాటు.


వివరాల్లోకి వెళితే… మియాపూర్‌లోని హెచ్ఎంటీ స్వర్ణప్యాలెస్‌కు చెందిన వెంకటబాలకృష్ణ పవన్‌కుమార్‌ కు హిమబిందు అనే యువతితో 2018లో వివాహమైంది. పెళ్లి సందర్భంగా వెంకటబాలకృష్ణకు అత్తింటివారు కట్నంతో పాటు ఇంకా ఇతర లాంఛనాల కింద రూ. 38 లక్షలు ఇచ్చారు. వివాహాం తరువాత హిమబిందును దుబాయ్ తీసుకెళ్లాడు పవన్ నిజస్వరూపం బైటపడింది. భార్య హిమబిందును తరచూ వేధించేవాడు.దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అనటంతో..నేను అన్నింటికి తెగించినవాడిని..ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను..నువ్వో లెక్కా అంటూ..ఈ విషయం బైటకు చెప్పొద్దంటూ బెదిరించటం మొదలుపెట్టాడు. దీంతో భర్త మోసాన్ని గ్రహించిన హిమబిందు తల్లిదండ్రులకు చెప్పింది. అనంతరం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త తనపై చేస్తున్న హింసల గురించి 2018లోనే మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని..న్యాయం కోసం పోలీసు స్టేషన్, కోర్టుల చుట్టూ తిరుగుతున్నా నాకు న్యాయం జరగట్లేదని దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని హిమబిందు వాపోయింది.ఓ రోజు ఐరన్ బాక్సుతో తన ముఖాన్ని కాల్చటానికి యత్నించాడని కానీ తాను అదృష్టవశాత్తు తప్పించుకున్నాననీ..ఆ తరువాత కూడా నాలుగు సార్లు తనపై హత్యాయత్నం చేశాడని ఫిర్యాదులో తెలిపింది. పవన్ తన ఫోన్‌ నంబర్, మెయిల్‌ ఐడీ హ్యాక్‌ చేశాడని ఆరోపించింది. తన భర్త పవన్‌కుమార్‌కు కఠినంగా శిక్షించాడని హిమబిందు డిమాండ్ చేస్తోంది.హిమబిందు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా..పవన్ తనకు అప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయని, తొలి ఇద్దరినీ వదిలేసినట్టు చెప్పాడు.అంతేకాక, మరో ఆరుగురితో సహజీవనం కూడా చేస్తున్నాడని ఆరోపించింది.పెళ్లి పేరుతో అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న పవన్‌ను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.