లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

కెనడాలో హైదరాబాద్‌ యువకుడు మృతి, ఫోన్ మాట్లాడుతూ 27వ అంతస్తు నుంచి పడిపోయిన అఖిల్‌

Published

on

hyderabad young man dies in canada: హైదరాబాద్‌ వనస్థలిపురానికి చెందిన అఖిల్‌(19) అనే యువకుడు కెనడాలో మృతి చెందాడు. టొరంటోలో హోటల్ మెనేజ్‌మెంట్‌ కోర్సు చేస్తున్న అఖిల్‌.. ప్రమాదవశాత్తు ఓ బిల్డింగ్‌పై నుంచి పడి మృతి చెందాడు. మొదటి సెమిస్టర్‌ పూర్తయ్యాక ఇంటికి తిరిగొచ్చిన అఖిల్‌.. అక్టోబర్ 5న తిరిగి కెనడాకు వెళ్లాడని తల్లిదండ్రులు తెలిపారు. ఇంతలోనే ఇంత దారుణం జరుగుతుందని తాము ఊహించలేదని కన్నీరుమున్నీరవుతున్నారు.

నవంబర్ 8న తెల్లవారుజామున 27వ అంతస్తులోని తన రూమ్‌ బాల్కనీలో ఫోన్‌ మాట్లాడుతుండగా.. అఖిల్ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు.. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని స్నేహితుల ద్వారా ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. తమ కుమారుడి మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు సహకరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, మంత్రి కేటీఆర్‌ను కోరారు తల్లిదండ్రులు.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బీజేపీ కార్యకర్త మృతి


హైదరాబాద్ వనస్థలిపురం ఫేజ్-4 లో అఖిల్ తల్లిదండ్రులు శ్రీకాంత్-హరిప్రియ దంపతులు నివాసం ఉంటున్నారు. కాలేజీలు తెరిచినట్టు సమాచారం రావడంతో అక్టోబర్ 5న అఖిల్ కెనడా వెళ్లాడు. శ్రీకాంత్ హరిప్రియ దంపతులకు ఇద్దరు సంతానం. రెండో కుమారుడు అఖిల్ కెనడాలో హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చదువుతున్నాడు. మార్చిలో లాక్ డౌన్ కు ముందే హైదరాబాద్ కు వచ్చి ఇంటి దగ్గరే ఉన్నాడు. అన్ లాక్ ప్రారంభమైన తర్వాత అక్టోబర్ లో కాలేజీలు తెరుస్తున్నట్లు కాలేజీ నుంచి సమాచారం వచ్చింది. దీంతో అక్టోబర్ 5న తిరిగి కెనడా వెళ్లి కాలేజీలో చేరాడు అఖిల్. ఆదివారం(నవంబర్ 8,2020) తెల్లవారుజామున తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *