లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

పెళ్లిలో పరిచయం – మంచి నీళ్లలో మత్తు మందు కలిపి అత్యాచారం

Published

on

Hyderabad young man rapes teen girl, filmed and viral : బంధువుల పెళ్లిలో పరిచయం అయిన యువతితో స్నేహం చేసి…స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేసిన యువకుడిని జడ్చర్ల పోలీసులు అరెస్ట్ చేశారు.

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన యువతి డిసెంబర్ 2020 లో హైదరాబాద్ లో బంధువుల ఇంటికి పెళ్ళికి వచ్చింది. ఆ పెళ్లిలో ఆమెకు మలక్ పేటకు చెందిన సబీల్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఆ క్రమంలో యువతి ఫోన్ నెంబరు తీసుకున్న సబీల్ యువతితో మాట్లాడటం, చాటింగ్ చేయటం ప్రారంభించాడు.

జనవరి 2వ తేదీన మరో ఇద్దరు స్నేహితులతో జడ్చర్ల వెళ్ళిన సబీల్ ఆయువతిని కొత్త బస్టాండ్ వద్దకురావాలని కోరాడు. అతని కోరిక మేరకు బస్టాండ్ వద్దకు వచ్చిన యువతిని స్ధానికంగా ఉన్న లాడ్డికి తీసుకువెళ్లారు. అక్కడ తమ ప్లాన్ అమలు చేశారు. ఆయువతి తాగటానికి …మత్తు మందు కలిపిన మంచినీళ్లు ఇచ్చారు. అవి తాగిన తర్వాత .యువతి అపస్మారక స్ధితికి చేరుకుంది.

అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు.అదంతా సెల్ ఫోన్ లో వీడియో తీసి బంధువులకు పంపాడు. ఈ వీడియో అడ్డంపెట్టుకుని సబీల్ స్నేహితులు కూడా బ్లాక్ మెయిల్ చేస్తూ యువతిని వేధించసాగారు. ఆమె లొంగకపోయే సరికి వీడియోను ఆమె తల్లితండ్రుల ఫోన్లకు కూడా పంపించారు.

అవి చూసిన బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నజడ్చర్ల పోలీసులు ముగ్గురునిందితులను సోమవారం హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. వారిని జడ్చర్ల తీసుకువచ్చి రిమాండ్ కు తరలించారు.