లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

యూట్యూబ్ నటిపై అసభ్య ప్రవర్తన- డ్రైవర్ పై కేసు నమోదు

Published

on

Hyderabad youtube actress filed a complaint against her driver due to illicit behaviour : హైదరాబాద్ కు చెందిన ఒక యూ ట్యూబ్ నటి పై ఆమె డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించన ఘటన ఇటీవల చోటుచేసుకుంది. ఈ మేరకు ఆమె బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఫిలింనగర్ కు చెందిన నేహా శర్మ(32) అనే యువతి యూ ట్యూబ్ వీడియోస్ లో నటిస్తూ ఉంటుంది.

జనవరి 13న ఆమె కేరళలోని పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించటానికి వెళ్ళింది. ఆమెతో పాటు ఆమె డ్రైవర్ షేక్ ఇబ్రహీం కూడా అక్కడకు వెళ్ళాడు. అయితే అక్కడ ఇబ్రహీం నేహా తో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది, ఇబ్రహీం మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడని, సమయానికి ఆ డ్రగ్ తీసుకోక పోవటంతో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తన ఫిర్యాదులో పేర్కోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.