తెలంగాణ సోదరులారా.. తమిళ సోదరిగా మీకోసం వస్తున్నా: కొత్త గవర్నర్ సౌందర రాజన్

  • Published By: vamsi ,Published On : September 1, 2019 / 09:00 AM IST
తెలంగాణ సోదరులారా.. తమిళ సోదరిగా మీకోసం వస్తున్నా: కొత్త గవర్నర్ సౌందర రాజన్

తమిళిసై సౌందర రాజన్.. తెలంగాణ కొత్త గవర్నర్.. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా ఈసీఎల్ నరసింహన్ సుధీర్ఘకాలం పనిచేసిన తర్వాత ఆయన స్థానంలో ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ కు బిశ్వభూషన్ రాగా ఇప్పుడు తెలంగాణకు ఆయన స్థానంలో తమిళసై సౌందర రాజన్ నియమితులయ్యారు. ఈ క్రమంలో ఆమె 10Tvతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు.

బీజేపీలో కష్టపడినవారికి కచ్చితంగా ఉంటుదని మరోసారి ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షులు అమిత్ షా నిరూపించారని ఆమె అన్నారు. భారతీయ జనతా పార్టీ కోసం నిరంతరం కృషి చేశానని, వయస్సుతో సంబంధం లేకుండా పార్టీ కోసం పనిచేసిన తనకు అవకాశం ఇచ్చారని ఆమె అన్నారు.

ఈ సంధర్భంగా తెలుగు వారి గురించి తెలంగాణ వారి గురించి మాట్లాడిన సౌందర రాజన్.. తెలంగాణకు గవర్నర్ గా నియమితులు కావడం ఆనందంగా ఉందని అన్నారు. తమిళ సోదరిని తెలంగాణ సోదరులు ఆదరిస్తారని, స్నేహపూర్వక వాతావరణంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని ఆమె చెప్పారు. తమిళనాడు బీజేపీ అభివృద్ధికి కృషి చేశానని ఇక తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె చెప్పారు. తెలంగాణ సోదరులకు తమిళ సోదరిగా వస్తున్నానంటూ ఆమె చెప్పారు.

బీజేపీ తరుపున ఆమె 2019ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో రెండుసార్లు విఫలం అయినా 58ఏళ్ల వయస్సులో ఆమెకు గవర్నర్ పదవి దక్కింది. తమిళసై సౌందర్‌రాజన్ కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌లో 1961 జూన్ 2న జన్మించారు. ఆమె తండ్రి అనంతన్ పార్లమెంటు మాజీ సభ్యుడే కాకుండా, తమిళనాడు కాంగ్రెస్ సీనియర్ నేత కూడా. తమిళిసై సౌందరరాజన్ చెన్నైలోని మద్రాసు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశారు.