గ్రేటర్ బరిలో 1122 మంది అభ్యర్ధులు

  • Published By: murthy ,Published On : November 24, 2020 / 07:20 AM IST
గ్రేటర్ బరిలో 1122 మంది అభ్యర్ధులు

1122 election candidates ghmc election 2020 : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్ధుల సంఖ్య తేలిపోయింది. గ్రేటర్‌లోని 150 వార్డులకుగాను… మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార టీఆర్‌ఎస్‌ 150స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపింది. దీంతో అన్ని డివిజన్లలోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పోటీలోఉన్నారు. ఇక బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేస్తోంది. నవాబ్‌ సాహెబ్‌ కుం టలో బీజేపీ అభ్యర్థిని నిలు పలేదు.తలాబ్‌చంచలం, బార్కా స్‌, గోల్కొండ, టోలీచౌకీల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థుల్లేరు.

ఇక కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థులను 146 డివిజన్లలో పోటీలోఉంచింది. నాలుగు డివిజన్లలో కాంగ్రెస్‌ అభ్యర్థులు బరిలోనుంచి తప్పుకున్నారు. ఇక టీడీపీ 106 చోట్ల పోటీ చేస్తోంది. మజ్లిస్‌ 51 డివిజన్లలో తమ పార్టీ తరపున అభ్యర్థులను బరిలో నిలిపింది. ఇక సీపీఐ 17 చోట్ల పోటీ చేస్తుండగా…. సీపీఎం మాత్రం 12 డివిజన్లలో పార్టీ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపింది. ఇతర రాజకీయ పార్టీలు 76 చోట్ల పోటీ చేస్తుండగా… స్వతంత్రులు 415 మంది వివిధ డివిజన్లలో…. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.


బల్దియా ఎన్నికల్లో మొత్తం 2,900లకుపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో తిరస్కరణ, ఉపసంహణ తర్వాత మొత్తంగా ఎంతమంది బరిలో నిలిచారనే వివరాలను అధికారులు ప్రకటించారు. అత్యధికంగా జంగంమెట్‌లో 20 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక అత్యల్పంగా ఉప్పల్‌, బార్కాస్‌, నవాబ్‌షాహెబ్‌కుంట, టోలీచౌక్‌, జీడిమెట్లలో డివిజన్లలో ఉన్నారు. ఇక్కడ ఒక్కోచోట కేవలం ముగ్గురు అభ్యర్థులే పోటీలో ఉన్నారు.

జీడిమెట్ల, టోలీచౌకీ, నవాబ్‌సాహెబ్‌కుంట, బార్కా స్‌, ఉప్పల్‌ డివిజన్లలో త్రిముఖ పోటీ జరుగుతుంది. ఉప్పల్‌లో బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులే బరిలో నిలిచారు. రామంతపూర్‌, మొఘల్‌పుర, తలాబ్‌చంచలం, గోల్కొండ, నానల్‌నగర్‌, అహ్మద్‌నగర్‌, ముషీరాబాద్‌, ఖైరతాబాద్‌, మోండామార్కెట్‌ డివిజన్లలో చతుర్ముఖ పోటీ నెలకొన్నది.



https://10tv.in/minister-ktr-road-show-for-ghmc-elections/
జంగమ్మెట్‌లో అత్యధికంగా 20మంది అభ్యర్థులు పోటీలో నిలాచారు. రహమత్‌నగర్‌ 14మంది, బంజారాహిల్స్‌లో 14, రాంనగర్‌లో 14, గోషామహల్‌లో 14, జాంబాగ్‌లో 14, శేరిలింగంపల్లిలో 13, మల్లాపూర్‌లో 13, తార్నాకలో 12, మంగల్‌హాట్‌లో 12, ఉప్పుగూడలో 12, ఆల్విన్‌ కాలనీలో 11, గాజులరామారంలో 11, ఓల్డ్‌ బోయిన్‌పల్లిలో 11, సరూర్‌నగర్‌లో 11, కేపీహెచ్‌బీకాలనీలో 11, గన్‌ఫౌండ్రీలో 11, బౌద్ధనగర్‌లో 10, యూసుఫ్‌గూడలో 10, రెడ్‌హిల్స్‌లో 10, గుడిమల్కాపూర్‌లో 10, మైలార్‌దేవ్‌పల్లిలో 10, గౌలిపురలో 10, మన్సూరాబాద్‌లో 10, మీర్‌పేట్‌ హెచ్‌బీకాలనీలో 10మంది పోటీలో ఉన్నారు.