హైదరాబాద్ గంట కొడుతుంది : సిటీలో క్లాక్‌ టవర్ల పునరుద్ధరణ

  • Edited By: madhu , February 14, 2019 / 06:41 AM IST
హైదరాబాద్ గంట కొడుతుంది : సిటీలో క్లాక్‌ టవర్ల పునరుద్ధరణ

హైదరాబాద్ : అప్పట్లో టైం చూసుకోవాలంటే ఎలా చూసుకొనే వారు తెలుసా ? చేతి వాచ్‌లు, గోడ గడియారాలు లేకుండేవి. ప్రధాన కూడళ్ల దగ్గర నిలబడి తలపైకెత్తితే క్లాక్ టవర్స్‌లో కనిపించే సమయాన్ని చూసేవారు. నగరం సంస్కృతిలో భాగం ఈ గడియారాలు. చారిత్రక సాక్ష్యాలన్నీ నిరాదరణకు గురవుతున్నాయి. ఒక్క హైదరాబాద్‌లో 12 క్లాక్ టవర్స్‌ ఉన్నాయి. చార్మినార్, మొజాంజాహి మార్కెట్, సికింద్రాబాద్‌లో ఉన్న ఈ వాచ్‌లు చాలా ప్రసిద్ధి. ప్రస్తుతం ఉనికి కోల్పోతున్న ఈ క్లాక్ టవర్స్‌ని బాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మొజాంజాహి మార్కెట్, ముర్గీ చౌక్ పునరుద్దరణ పనులు స్టార్ట్ అయ్యాయి. తాజాగా క్లాక్ టవర్లకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 

శాలిబండ, సుల్తాన్ బజార్, మోండా మార్కెట్‌లలో ఉన్న టవర్స్ పరిస్థితిని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్స్ పల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఫిబ్రవరి 13వ తేదీ బుధవారం పరిశీలించారు. సుల్తాన్ బజార్ క్లాక్‌టవర్ దగ్గర ప్రధాన రహదారి వైపు భాగం ఆక్రమనకు గురైందని గమనించి అరవింద్ కుమార్.. వెంటనే తొలగించాలని, చుట్టూ ప్రహారీగోడను నిర్మించాలని సూచించారు. క్లాక్ టవర్ పునరుద్ధరణకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సుల్తాన్ బజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న పాత అసెంబ్లీ హాల్‌కు మరమ్మత్తు కూడా చేయాలన్నారు. మోండా మార్కెట్ క్లాక్ టవర్, సమీపంలోని జైల్ ఖానా మరమ్మత్తు పనులపై స్థానిక వ్యాపారులతో చర్చించారు. 

అన్నీ క్లాక్ టవర్స్‌లను అందంగా తీర్చిదిద్దాలని..చుట్టూ గోడ కట్టి..లైటింగ్ వేయాలని అధికారులకు సూచించారు. ఏవైనా ఆక్రమణలు ఉంటే కూలగొట్టి..వెంటనే రిపేర్ చేయాలని సూచించారు. ఈ టవర్స్ సమీపంలో ఉన్న దుకాణ దారులు సహకరించాలని ఆయన సూచించారు. 

నగరంలో ఉన్న క్లాక్ టవర్స్ :  *  సికింద్రాబాద్  జేమ్స్ స్ట్రీట్   సుల్తాన్ బజార్  ఫతే మైదాన్  మొజాంజాహి మార్కెట్   మహబూబ్ చౌక్   సెయింట్ జార్జ్   చార్మినార్  శాలిబండ