చిచ్చర పిడుగు : 7వ తరగతికే సాఫ్ట్ వేర్ ఉద్యోగం

వయసు 12 ఏళ్లు. చదువుతున్నది 7వ క్లాస్. కానీ అప్పుడే సాఫ్ట్ వేర్ జాబ్ సంపాదించాడు. నెలకు రూ.25వేలు జీతం కూడా సంపాదిస్తున్నాడు. పిల్లాడు కాదు చిచ్చరపిడుగు అని

  • Published By: veegamteam ,Published On : October 30, 2019 / 04:43 AM IST
చిచ్చర పిడుగు : 7వ తరగతికే సాఫ్ట్ వేర్ ఉద్యోగం

వయసు 12 ఏళ్లు. చదువుతున్నది 7వ క్లాస్. కానీ అప్పుడే సాఫ్ట్ వేర్ జాబ్ సంపాదించాడు. నెలకు రూ.25వేలు జీతం కూడా సంపాదిస్తున్నాడు. పిల్లాడు కాదు చిచ్చరపిడుగు అని

వయసు 12 ఏళ్లు. చదువుతున్నది 7వ క్లాస్. కానీ అప్పుడే సాఫ్ట్ వేర్ జాబ్ సంపాదించాడు. నెలకు రూ.25వేలు జీతం కూడా సంపాదిస్తున్నాడు. పిల్లాడు కాదు చిచ్చరపిడుగు అని పిలిపించుకుంటున్నాడు. ఆ పిల్లాడి  పేరు శరత్. ఓ వైపు స్కూల్ లో చదువుకుంటూనే మరోవైపు సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నాడు. మోంటైగ్నే కంపెనీలో డేటా సైంటిస్ట్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో 12 ఏళ్ల వయసులోనే ఏకంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని సాధించాడు శరత్. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పి.రాజ్‌కుమార్, ప్రియ క్యాప్‌ జెమినీలో ఉద్యోగులు. మణికొండ  మున్సిపాలిటీ కేంద్రంలో నివాసం ఉంటున్నారు. వారి కుమారుడే శరత్‌. స్థానిక శ్రీచైతన్య స్కూల్ లో 7వ క్లాస్ చదువుతున్నాడు.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులైన తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో రోజూ ల్యాప్‌ టాప్‌లో పనిచేయటాన్ని శరత్ చిన్నప్పటి నుంచి గమనిస్తూ వస్తున్నాడు. దీంతో ఏడేళ్ల వయసులోనే కోడింగ్, జావా సాఫ్ట్‌వేర్‌లపై ఆసక్తి పెంచుకున్నాడు. వాటిని నేర్చుకున్నాడు. శరత్ టాలెంట్‌ను గమనించిన తల్లిదండ్రులు ఐటీ ఉద్యోగిగా పనికొస్తాడని నిర్ణయించారు. ఆ వెంటనే పలు ఐటీ సంస్థల్లో ఉద్యోగాలకు అప్లయ్ చేసి ఇంటర్వ్యూలకు పంపారు. ఇటీవల మోంటైగ్నే సంస్థలో డేటా సైంటిస్ట్ జాబ్ కి శరత్ సెలెక్ట్ అయ్యాడు. నెలకు రూ.25 వేల సాలరీ. శరత్ టాలెంట్ ను గుర్తించిన కంపెనీ.. మరో మాట మాట్లాడకుండా డేటా సైంటిస్ట్ జాబ్ ఇచ్చింది.

జాబ్ కి సెలెక్ట్ అయ్యాడు.. మరి స్కూల్ సంగతి ఏంటి అని సందేహం రావొచ్చు. అందుకోసం శరత్ కి కంపెనీ, స్కూల్ వాళ్లు అవకాశం ఇచ్చారు. వారంలో మూడు రోజులు స్కూల్‌కు వెళ్లి పాఠాలు వినేలా.. మరో  మూడు రోజులు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేసేలా పర్మిషన్ ఇచ్చారు. 12 ఏళ్ల వయసులో 7వ తరగతి చదువుతూ డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగం దక్కించుకున్న శరత్‌ను తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందించారు.

సాఫ్ట్ వేర్ జాబ్ సంపాదించడం అంటే అంత ఈజీ కాదు. ఇంజినీరింగ్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఆ తర్వాత స్పెషల్ కంప్యూటర్ కోర్సులు, లాంగ్వేజ్ లు నేర్చుకుని ఉండాలి. కంపెనీలు పెట్టే పరీక్షలు పాస్ అవ్వాలి. ఇవన్నీ సక్సెస్ అయితేనే జాబ్ వస్తుంది. అలాంటిది.. ఆడుతూ పాడుతూ స్కూల్ లో చదువుకునే పిల్లాడు… సాఫ్ట్ వేర్ ఉద్యోగి కావడం అంటే మాములు విషయం కాదని.. కచ్చితంగా ఆ కుర్రాడి టాలెంట్ ను అభినందించాల్సిదే అని నెటిజన్లు అంటున్నారు.