Odisha trains accident: ఒడిశా రైళ్ల ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య…233కి దాటిన మృతుల సంఖ్య

ఈ ప్రమాదంలో క్షతగాత్రుల సంఖ్య కూడా 900కు దాటింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 233 దాటిందని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా అధికారికంగా ప్రకటించారు. అయితే మృతుల సంఖ్యతో పాటు క్షతగాత్రుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉందని స్థానికులు చెబుతున్నారు.

Odisha trains accident: ఒడిశా రైళ్ల ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య…233కి దాటిన మృతుల సంఖ్య

Odisha Train Crash

Odisha trains accident: ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైళ్ల ప్రమాదాల్లో మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. కోరమండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైళ్లు ఢీకొన్న ఘటనలో శనివారం ఉదయం నాటికి మృతుల సంఖ్య 233కి చేరింది.(Massive Train Tragedy In Odisha) ఈ ప్రమాదాల్లో మృతదేహాలు రైలు బోగీలు, వాటి కింద ఉండటంతో వారిని వెలికితీయడం కష్టతరంగా మారింది.

ఈ ప్రమాదంలో క్షతగాత్రుల సంఖ్య కూడా 900కు దాటింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 233 దాటిందని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా అధికారికంగా ప్రకటించారు. అయితే మృతుల సంఖ్యతో పాటు క్షతగాత్రుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉందని స్థానికులు చెబుతున్నారు.

Railways Minister Ashwini Vaishnaw: ఒడిశా రైళ్ల ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ

కోరమండల్ ఎక్స్ ప్రెస్, యశ్వంత్ పూర్ -హౌరా సూపర్ ఫాస్ట్ రైలు బోగీలు పక్ రైలు పట్టాలు పడిపోయాయని రైల్వే మంత్రిత్వశాఖ ప్రతినిధి అమితాబ్ శర్మ చెప్పారు. మూడు ఎన్డీఆర్ఎఫ్, నాలుగు ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు, 15 అగ్నిమాపకశాఖ బృందాలు, 30 మంది వైద్యులు, 200మంది పోలీసులు, 60 అంబులెన్సులను రంగంలోకి దించి సహాయ పునరావాస పనులు చేస్తున్నామని ఒడిశా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జెనా చెప్పారు. సహాయ కార్యక్రమాల కోసం సంఘటన స్థలంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.