గుడ్ బై 2019 : హైదరాబాద్ లో 31st నైట్ ఫీవర్

మరి కొన్ని గంటల్లో 2019 ముగుస్తుంది. కొత్త సంవత్సరం 2020 వస్తుంది. 2019కి గుడ్ బై చెప్పి.. న్యూఇయర్ కు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పేందుకు హైదరాబాద్ నగరవాసులు రెడీ

  • Published By: veegamteam ,Published On : December 31, 2019 / 01:34 PM IST
గుడ్ బై 2019 : హైదరాబాద్ లో 31st నైట్ ఫీవర్

మరి కొన్ని గంటల్లో 2019 ముగుస్తుంది. కొత్త సంవత్సరం 2020 వస్తుంది. 2019కి గుడ్ బై చెప్పి.. న్యూఇయర్ కు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పేందుకు హైదరాబాద్ నగరవాసులు రెడీ

మరికొన్ని గంటల్లో 2019 ముగుస్తుంది. కొత్త సంవత్సరం 2020 వస్తుంది. 2019కి గుడ్ బై చెప్పి.. న్యూఇయర్ కు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పేందుకు హైదరాబాద్ నగరవాసులు రెడీ అయ్యారు. హైదరాబాద్ లో థర్టీ ఫస్ట్ నైట్ ఫీవర్ కనిపిస్తోంది. పార్టీలు, ఈవెంట్స్ కు జనం తరులుతున్నారు. దీంతో మెయిన్ రోడ్లలో ఒక్కసారిగా ట్రాఫిక్ పెరిగింది. వాహనాలతో రోడ్లన్నీ నిండాయి. సిటీలోని చాలా ప్రాంతాలు, జంక్షన్స్ లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి.

డిసెంబర్ 31.. 2019లో నేడు చివరి రోజు. ఈ ఏడాదికి కొన్ని గంటల్లో వీడ్కోలు పలకనున్నాం. మన జీవితాల్లో ఎన్నో తీపి, చేదు.. జ్ఞాపకాలను, అనుభూతలను మిగిల్చింది 2019. పాత ఏడాదికి టాటా చెబుతూ.. కొత్త ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు అంతా సిద్ధమయ్యారు.

అటు.. ఆస్ట్రేలియాలో కొత్త సంవత్సరం వచ్చేసింది. ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీ వాసులు నూతన సంవత్సరం 2020కి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. సిడ్నీలో న్యూఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సంబరాలు అంబరాన్నంటాయి. కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలుకుతూ ఒకరికొకరు విషెస్ చెప్పుకుంటున్నారు. సిడ్నీ హార్బర్ లో ఫైర్ వర్క్స్ కనువిందు చేశాయి. ఒపెరా హౌస్ దగ్గర వేడుకలు మిన్నంటాయి.

2019 ఇచ్చిన తీపి గుర్తులను గుండెల్లో దాచుకొని.. సరైన దారుల్ని వెతుక్కొంటూ 2020లోకి అడుగు పెట్టేస్తున్నాం. హ్యాపీ న్యూ ఇయర్‌ అంటూ కొత్త సంవత్సర ఘడియల్లో సందడి చేసేందుకు అంతా సిద్ధమయ్యారు. ప్రపంచమంతా కొత్త ఏడాదికి సగర్వంగా స్వాగతం పలుకుతోంది.

ప్రపంచంలోనే మొట్టమొదటి న్యూఇయర్‌ వేడుకలు సమోవా దేశంలో జరుగుతాయి. ఆ తర్వాత న్యూజిలాండ్ లో. న్యూయర్ సంబరాలు ఆక్లాండ్ లో అంబరాన్నంటాయి. బాణాసంచా వెలుగులు, లేజర్‌ షోలతో న్యూజిలాండ్ వాసులు న్యూఇయర్ కి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు.