సమ్మర్ స్పెషల్ : కాచిగూడ – కాకినాడ మధ్య 36 ప్రత్యేక రైళ్లు

  • Published By: veegamteam ,Published On : February 26, 2019 / 03:47 AM IST
సమ్మర్ స్పెషల్ : కాచిగూడ – కాకినాడ మధ్య 36 ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్ : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. వేసవి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కాచిగూడ-కాకినాడ మధ్య 36 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. ఈమేరకు ఫిబ్రవరి 25 సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 1 నుంచి జూన్ 29వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు వెల్లడించారు. రైళ్లలో ఏసీ టూ టైర్, త్రీ టైర్, స్లీపర్, జనరల్ బోగీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 

కాచిగూడ-కాకినాడ (07425/07426) ప్రత్యేక రైలు.. మార్చి1, 8, 15, 22, 29. ఏప్రిల్ 5, 12, 19, 26. మే 3, 10, 17, 24, 31. జూన్ 7, 14, 21, 28వ తేదీల్లో సాయంత్రం 6.45 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. 

తిరుగు ప్రయాణంలో మార్చి 2, 9, 16, 23, 30. ఏప్రిల్ 6, 13, 20, 27. మే 4, 11, 18, 25. జూన్ 1, 8, 15, 22, 29వ తేదీల్లో సాయంత్రం 6.10 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.10 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.