భళా బుడ్డోడా : 12 ఏళ్లకే డేటా సైంటిస్ట్ జాబ్! 

  • Published By: sreehari ,Published On : November 26, 2019 / 11:41 AM IST
భళా బుడ్డోడా : 12 ఏళ్లకే డేటా సైంటిస్ట్ జాబ్! 

చదివేది ఏడో తరగతే. సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ కొట్టాడో హైదరాబాద్ బుడ్డోడు. 12ఏళ్లకే డేటా సైంటిస్టు అయ్యాడు. భాగ్యనగరానికి చెందిన సిద్ధార్థ్ శ్రీవాస్తవ్ పిల్లె (12) ఓ ప్రైవేటు స్కూళ్లలో 7వ తరగతి చదువుతున్నాడు. పిన్న వయస్సులోనే సైన్స్ అండ్ టెక్నాలజీపై ఎంతో ఆసక్తి పెంచుకున్నాడు. అదే ఉత్సాహంతో తన సైన్స్ పరిజ్ఞానాన్ని మరింత మెరుగుపర్చుకున్నాడు. సిద్ధార్థ్ సైన్స్ స్కిల్స్ చూసిన మాంటైగ్నే స్మార్ట్ బిజినెస్ సొల్యుషన్స్ అతడికి జాబ్ ఆఫర్ ఇచ్చింది.

సాఫ్ట్ వేర్ కంపెనీ నుంచి పిలుపు రావడంతో సిద్ధార్థ్ డేటా సైంటిస్ట్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ‘నాకు 12 ఏళ్లు మాత్రమే. Montaigne Smart బిజినెస్ సొల్యుషన్స్ సాఫ్ట్ వేర్ కంపెనీలో డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తున్నాను. 7వ తరగతి చదువుతున్నాను. తన్మయ్ బాక్సీ లాంటి సాఫ్ట్ వేర్ కంపెనీలో చేరడమే నాకు స్పూర్తి అంటున్నాడు. ఎందుకంటే పిన్న వయస్సులోనే గూగుల్ కంపెనీలో జాబ్ సంపాదించాడు.

అంతేకాదు.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రెవిల్యూషన్ ఎంతో గొప్పగా ఉంటుందో ప్రపంచం అర్థం చేసుకోవడంలో సాయపడ్డాడు కూడా. చిన్నప్పటి నుంచే కోడింగ్ పై ఆసక్తి చూపిస్తుండటంతో సిద్ధార్థ్ తండ్రి మరింత ప్రోత్సాహించాడు. అదే స్ఫూర్తితో తాను డేటా సైంటిస్ట్ స్థాయికి ఎదిగానంటూ తండ్రికి కృతజ్ఞతలు తెలిపారు.