లాక్ డౌన్ ఫెయిల్ అయితే, భారత్ లో రానున్న 4 నెలల్లో 70కోట్ల మందికి కరోనా వైరస్-జేపీ

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన కరోనా వైరస్ ఇప్పుడు

  • Published By: veegamteam ,Published On : March 28, 2020 / 02:42 PM IST
లాక్ డౌన్ ఫెయిల్ అయితే, భారత్ లో రానున్న 4 నెలల్లో 70కోట్ల మందికి కరోనా వైరస్-జేపీ

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన కరోనా వైరస్ ఇప్పుడు

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. 190కు పైగా దేశాలకు ఈ మహమ్మారి వ్యాపించింది. మన దేశంలోనూ కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. అప్రమత్తమైన భారత ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. కరోనా వ్యాప్తి కట్టడి కోసం లాక్ డౌన్ ప్రకటించింది. అన్ని వ్యాపారాలు, షాపులు మూతపడ్డాయి. బస్సులు, రైళ్లు, విమానాలు బంద్ అయ్యాయి. ప్రజా రవాణ వ్యవస్థ నిలిచిపోయింది. ముందు మార్చి 31వరకు లాక్ డౌన్ అన్న ప్రధాని తర్వాత 21 రోజులకు లాక్ డౌన్ పొడిగించారు. అంటే కరోనా తీవ్రత ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా ఇప్పటివరకు వ్యాక్సిన్ కనిపెట్టలేకపోయారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా లాక్ డౌన్ ప్రకటించింది. లాక్ డౌన్ అంటే ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. ఎవరూ బయటకు రాకూడదలు. అత్యవసర పనులుంటేనే బయటకు రావాలి. లేదంటే గడప దాటకూడదు. 

దేశంలో ఎంతో సీరియస్ గా లాక్ డౌన్ అమలవుతోంది. అయితే వలస కూలీలు, పేదలపై లాక్ డౌన్ ప్రభావం తీవ్రంగా ఉంది. రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. పూట గడవడం కష్టం కావడంతో వలస కూలీలు అష్టకష్టాలు పడుతున్నారు. లాక్ డౌన్ లెక్క చేయకుండా రోడ్డుమీదకు వస్తున్నారు. కొందరు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ పరిస్థితులపై లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ స్పందించారు. కరోనా వైరస్ తీవ్రత గురించి, లాక్ డౌన్ గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో లాక్ డౌన్ కనుక ఫెయిల్ అయితే కరోనా వేగంగా విస్తరిస్తుందన్నారు. రానున్న 4 నెలల్లో మన దేశంలో 50 నుంచి 70 కోట్ల మందికి కరోనా సోకే ప్రమాదం ఉందని జేపీ హెచ్చరించారు. 10టీవీలో జరిగిన డిబేట్ లో పాల్గొన్న జేపీ ఈ సంచలన కామెంట్స్ చేశారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలెవరూ బయటకు రాకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. ప్రజలెవరూ బయటకు రాకుండా ఉండాలంటే వారికి అవసరమైన ఆహారం అందించాలన్నారు.

” ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా 5 నుంచి 10శాతం వరకు కచ్చితంగా కరోనా ప్రభావం తగ్గొచ్చు. ఈ లాక్ డౌన్ ఏప్రిల్ తో ఆగదు. మే వరకు గట్టిగా లాక్ డౌన్ చేయాల్సిందే. పొరపాట్లు సవరించి మరీ లాక్ డౌన్ చేయాల్సిందే. అదే సమయంలో సామాన్యులకు, పేదలకు ఇబ్బంది లేకుండా చేయాలి. వాళ్ల భోజనానికి ఇబ్బంది లేకుండా చేయాలి. అందరూ ఇళ్లలోనే ఉండాలి. వైరస్ ఇన్ ఫెక్షన్ లేకుండా చేయాలి. అప్పుడే ఈ దేశాన్ని, పేద ప్రజలను మనం కాపాడుకోగలుగుతాం. ఈ సమయంలో సిద్ధాంతాలు వద్దు. రాజ్య వ్యవస్థను మార్చడం కోసం మన పోరాటం కాదు. మనం ఒక యుద్ధంలో ఉన్నాం. ఒక యుద్ధంలో ఉన్నప్పుడు, దేశాన్ని కాపాడుకోవాలి. ఇవాళ మన సమాజాన్ని కాపాడుకోవాలి. లక్షల మంది ప్రాణాలు కాపాడుకోవాలి. లక్షల మంది ఒక్కసారిగా ఆసుపత్రుల మీద పడకుండా, ఉన్న ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలకుండా కాపాడుకోవాలి. మిగతా చర్చలు తర్వాత చూద్దాం. లాక్ డౌన్ కారణంగా తినడానికి ఇబ్బందిగా ఉందని ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. వారిని పట్టించుకునే నాథుడు లేడు. క్వారంటైన్ వారికి వర్తించదు. 100 మందిలో 20 మంది ఐసోలేషన్ లో లేకుండా, లాక్ డౌన్ ఫెయిల్ అయినట్టు అయితే నూటికి నూరుశాతం దేశంలో కరోనా తీవ్రంగా విస్తరింస్తుంది.  లాక్ డౌన్ ఫెయిల్ అయినట్టు అయితే భారత్ లో రానున్న 4 నెలల్లో 50 నుంచి 70 కోట్ల మందికి కరోనా సోకుతుంది” అని జేపీ హెచ్చరించారు.