ఐదేళ్లలో 787 కాలేజీలు మూసివేత

  • Published By: veegamteam ,Published On : January 9, 2019 / 07:19 AM IST
ఐదేళ్లలో 787 కాలేజీలు మూసివేత

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఏడాది విద్యాప్రమాణాలు తగ్గిపోతున్నాయి. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఉన్నత విద్యామండలి పలు కాలేజీలను మూసివేసేందుకు చర్యలు తీసుకుంది. దీంతో కేవలం 5 సంవత్సరాల్లో 787 కాలేజీలను హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ మూసివేసింది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తేల్చిన లెక్కల ప్రకారంగా చూస్తే..2014–15 ఎడ్యుకేషన్ ఇయర్ లో రాష్ట్రంలో హైయర్ ఎడ్యుకేషన్  కాలేజీలు 3,688 ఉంటే 2018–19 విద్యా సంవత్సరం నాటికి 2,901కి తగ్గాయి. అంటే కేవలం ఐదేళ్లలో 787 కాలేజీలు మూతపడ్డాయి. 2020లో మరో 200 డిగ్రీ, ఇతర కాలేజీలు మూత పడే అవకాశం ఉన్నట్లుగా ఉన్నత విద్యామండలి తెలిపింది.

పెరిగిన సీట్లు..తగ్గిన విద్యార్ధులు
ఐదేళ్లలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, బి.ఫార్మసీ, ఫార్మ్‌–డి, ఎంసీఏ, ఎంబీఏ, బీఈడీ, న్యాయవిద్య, ఎంటెక్, ఎం.ఫార్మసీ, బీపీఈడీ తదితర కోర్సులు నిర్వహించే కాలేజీలు వందల సంఖ్యలో తగ్గినా ఆయా కోర్సుల్లో సీట్లు మాత్రం భారీగా పెరిగాయి. అయినా పెరిగిన సీట్లకు అనుగుణంగా విద్యార్థుల ప్రవేశాలు లేకపోవడం గమనించాల్సిన విషయం. 

ఎక్కువగా మూసివేయబడిన డిగ్రీ కాలేజీలు..
ఎక్కువగా మూసివేయబడుతున్న కాలేజీల్లో డిగ్రీ కాలేజీలే ఎక్కువగా వున్నాయి. 2018–19లో 1,151 డిగ్రీ కాలేజీల్లో ఎంట్రీలు ఉండగా..వాటిలో 25 పర్సెంట్ ఎంట్రీలు జరిగిన కాలేజీలు 786 ఉన్నాయి. 280 కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరకపోవటంతో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు.
ఇప్పటికే సెకండ్, థర్డ్ ఇయర్ లో స్టూడెంట్ వుండగా..ఎడ్యుకేషన్ క్వాలిటీస్ పెంచుకోకుంటే నెక్ట్స్ ఎడ్యుకేషన్ ఇయర్ నాటికి 150 కాలేజీలు క్లోజ్ అయ్యే ప్రమాదం వుంది. మరో 200 కాలేజీల అనుమతులు రద్దు కానున్నాయి.