ఓటర్స్ డే : అధికారి శైలజకు అవార్డు

  • Published By: madhu ,Published On : January 25, 2019 / 11:12 AM IST
ఓటర్స్ డే : అధికారి శైలజకు అవార్డు

ఢిల్లీ : జనవరి 25 నేషనల్ ఓటర్స్ డే. 2018లో పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఉత్తమ విధులు నిర్వహించిన అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రధానం చేయనున్నారు. వెల్పేర్ ఆఫ్ డిసబుల్ అండ్ సీనియర్ సిటిజన్స్ డైరెక్టర్‌గా ఉన్న శైలజకు అవార్డు వరించింది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ విధులు నిర్వహించినందుకు ఈ అవార్డు వరించింది.

వికలాంగులతో ఓటు వేయించడంలో శైలజ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. 2014 ఎన్నికలతో పోలిస్తే వికలాంగుల ఓటు శాతం రెండింతలు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. శైలజ తీసుకున్న నిర్ణయాలను గుర్తిస్తూ ప్రత్యేక కేటగిరీలో ఈసిఐ అవార్డు ప్రకటించింది. 

రాష్ట్రంలో ఉన్న అంధ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఎన్నికల కమిషన్, దివ్యాంగ సంక్షేమ శాఖ డైరెక్టర్, ఉప ముఖ్య ఎన్నికల అధికారిగా ఉన్న శైలజలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీరికోసం ఏకంగా బ్రెయిలీ లిపిలో అంకెలను ఏర్పాటు చేశారు. ఓటర్ గుర్తింపు..కార్డు..బ్యాలెట్ కాగితం..ప్రచార కరపత్రాలు సైతం బ్రెయిలీలో ఉన్నాయి. ఈవీఎంలను తడిమి చూసి ఎవరి సాయం లేకుండానే వారు ఓటు వేసే విధంగా చర్యలు తీసుకున్నారు. అంతేగాకుండా బధిర, మూగ ఓటర్లకు సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంలో శైలజ కీలక పాత్ర పోషించారు.