దేశానికి KCR నాయకత్వం అవసరం – కడియం

  • Published By: madhu ,Published On : April 3, 2019 / 07:59 AM IST
దేశానికి KCR నాయకత్వం అవసరం – కడియం

దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం – కడియం భారతదేశానికి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరమని మాజీ ఉప ముఖ్యమంత్రి, మండలి సభ్యుడు కడియం శ్రీహరి అన్నారు. ఎన్నికల తర్వాత వివిధ ప్రాంతీయ పార్టీలతో కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ రాదని..బీజేపీ నేతృత్వంలోని కూటమికి కూడా 150-200 లోపు..కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏకి 100-150 సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు. వరంగల్‌లో ఏప్రిల్ 03వ తేదీ బుధవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. 543 సభ్యులున్న పార్లమెంట్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అంటే కూటమి 272 స్థానాలు గెలవాల్సినవసరం ఉందని..ఆ పరిస్థితి ఇప్పుడు లేదన్నారు.

కాంగ్రెస్..బీజేపీకి సమాన దూరం పాటిస్తున్న కొన్ని ప్రాంతీయ పార్టీలు 200 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పోస్ట్ పోల్ అలెయెన్స్ కుదిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు చెప్పారు. ప్రాంతీయ పార్టీలు ఒకేతాటిపైకి తీసుకొచ్చి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ లక్ష్యమన్నారు. 17 సీట్లతో కేసీఆర్ ఏం చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారని..కానీ అన్నీ సీట్లలో విజయం సాధిస్తే కేసీఆర్ జాతీయ దృష్టిని ఆకర్షిస్తారని..తదనుగుణంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడే ఛాన్స్ ఉందన్నారు. తెలంగాణలో ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శవంతం అవుతున్నాయన్నారు.