ఎన్నికల ఎఫెక్ట్ :యాక్టివాలో కోటిన్నర తరలింపు..సీజ్ 

  • Published By: veegamteam ,Published On : March 25, 2019 / 04:42 AM IST
ఎన్నికల ఎఫెక్ట్ :యాక్టివాలో కోటిన్నర తరలింపు..సీజ్ 

హైదరాబాద్‌: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ మొత్తంతో తలించే నగదు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఎన్నికల వేళ  హైదరాబాద్‌లో యాక్టివాలో కోటిన్నర రూపాయలను పట్టుకుని వెళ్లున్న  నగదును పోలీసుల తనిఖీలలో భాగంగా వాటిని స్వాధీనం చేసుకుని  సీజ్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. పెద్దమ్మ తల్లి గుడి దగ్గర పోలీసులు తనిఖీలు చేపట్టగా..శనివారం (మార్చి 24) రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  

ఇద్దరు వ్యక్తులు యాక్టివా స్కూటర్‌పై రెండు బ్యాగులను తీసుకెళ్తుండగా..అనునించిన పోలీసులు వారిని ఆపి బ్యాగులను తెరిచి చూడగా.. రూ.1.49 కోట్ల నగదు ఉన్నట్టు గుర్తించారు. కాగా దీనికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు చూపించకపోగా..సరైన వివరాలను కూడా వెల్లడించకపోవటంతో పోలీసులు నగదుతో పాటు వారి మొబైల్ కూడా స్వాధీనం చేసుకుని  సీజ్ చేశారు. స్కూటర్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు గోపీనాథ్ అనే 47 వ్యక్తి, రాఘవేందర్ అనే 32 వ్యక్తులగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కోసం ఈ నగదును ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.