ఫొటో స్లిప్పు..గుర్తింపు కార్డు తప్పనిసరి – దాన కిశోర్

  • Published By: madhu ,Published On : April 11, 2019 / 03:11 AM IST
ఫొటో స్లిప్పు..గుర్తింపు కార్డు తప్పనిసరి – దాన కిశోర్

తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ మొదలయ్యాయని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ ఎం. దాన కిశోర్ వెల్లడించారు. కమాండ్ కంట్రోల్ ద్వారా ఆయన ఎన్నికల సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనతో 10tv మాట్లాడింది. ఫొటో ఓటర్ స్లిప్పుతో పాటు ఈసీ తెలిపిన 11 గుర్తింపు కార్డులు తీసుకరావాలని ఓటర్లకు సూచించారు. సిటీలో పోలింగ్ ప్రశాంతంగా పోలింగ్ సాగుతోందని, ఉదయం నుండే ప్రజలు ఓటు వేయడానికి వచ్చారన్నారు.

ఎండల తీవ్రత కారణంగా ఓటు వేసేందుకు ముందుగానే వచ్చి ఉండవచ్చునన్నారు. కొన్ని చోట్ల ఈవీఎంల్లో పలు సమస్యలను ఏర్పడ్డాయని, రెండో ఈవీఎంలు ఏర్పాటు చేయడంతో వెంటనే సరిచేసినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఎండ వేడిమి తగలకుండా టెంట్లు..మంచినీరు సదుపాయం కల్పించామన్నారు. వృద్ధుల కోసం వాలంటీర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

మాక్ పోలింగ్ సజావుగా జరిగినట్లు..పోలింగ్ కూడా ప్రశాంతంగా జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. ఈవీఎంలు మొరాయించిన చోట్ల టెక్నికల్ సిబ్బంది సరి చేశారని తెలిపిన రజత్ కుమార్…నిజామాబాద్‌లో ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు.