అఖిలపక్ష సమావేశం రసాభాస : ఎన్నికల అధికారి నాగిరెడ్డి తీరుపై విపక్షాల ఆగ్రహం

మున్సిపల్ ఎన్నికలపై ఈసీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వం చెప్పినట్టు ఎన్నికల సంఘం నడుచుకుంటుందంటూ నాగిరెడ్డితో కాంగ్రెస్‌ నేతలు వాగ్వాదానికి దిగారు.

  • Published By: veegamteam ,Published On : December 29, 2019 / 02:16 AM IST
అఖిలపక్ష సమావేశం రసాభాస : ఎన్నికల అధికారి నాగిరెడ్డి తీరుపై విపక్షాల ఆగ్రహం

మున్సిపల్ ఎన్నికలపై ఈసీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వం చెప్పినట్టు ఎన్నికల సంఘం నడుచుకుంటుందంటూ నాగిరెడ్డితో కాంగ్రెస్‌ నేతలు వాగ్వాదానికి దిగారు.

మున్సిపల్ ఎన్నికలపై ఈసీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వం చెప్పినట్టు ఎన్నికల సంఘం నడుచుకుంటుందంటూ నాగిరెడ్డితో కాంగ్రెస్‌ నేతలు వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్‌ చర్యను టీఆర్ఎస్‌ తప్పుబట్టింది. రిజర్వేషన్లు ఖరారు కాకుండా షెడ్యూల్ విడుదల చేయడంపై కాంగ్రెస్‌ తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఎన్నికల అధికారి నాగిరెడ్డతో కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌ రెడ్డి గొడవకు దిగారు. టీఆర్ఎస్‌కు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఆరోపణలపై నాగిరెడ్డి తీవ్రంగా స్పందించారు. దీంతో సమావేశం నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది.

ఈసీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుంది : కాంగ్రెస్ 
పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంటామని పిలిపించి ఎన్నికల సంఘం తమను అవమానించిందని కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి మండిపడ్డారు. పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని వాపోయారు. పైగా ఎన్నికల అధికారులు అభ్యంతరకర భాష వాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు, రిజర్వేషన్‌ అంశాలపై సూచనలను ఈసీ పట్టించుకోలేదని అన్నారు.  నాగిరెడ్డి తీరుపై బీజేపీ, టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎన్నికల సంఘం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుందని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌ రెడ్డి విమర్శించారు. సంక్రాంతి సందర్భంగా ఓటర్లకు వెసులుబాటు కల్పించాలన్నా వినిపించుకోలేదన్నారు.

విపక్షాల తీరుపై టీఆర్ఎస్‌ అసహనం 
విపక్షాల తీరుపై టీఆర్ఎస్‌ పార్టీ అసహనం వ్యక్తం చేసింది. ఫిబ్రవరిలో మేడారం జాతరకు ఇబ్బంది కలగకూడదనే జనవరిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారన్నారు గట్టు రామచందర్‌రావు. సమావేశం నుంచి కాంగ్రెస్‌ వాకౌట్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

కాంగ్రెస్‌ నేతల తీరుపై నాగిరెడ్డి ఫైర్‌
అటు కాంగ్రెస్‌ నేతల తీరుపై ఎన్నికల అధికారి నాగిరెడ్డి ఫైర్‌ అయ్యారు. అధికారులను పట్టుకొని నేతలు ఇష్టమున్నట్టు మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికలపై అన్నిపార్టీల అభిప్రాయాలు తీసుకున్నామన్నారు నాగిరెడ్డి. కోర్టు ఆదేశాల మేరకే ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది.