రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ :పార్టీ ఫిరాయింపులపై అఖిల పక్షం 

  • Published By: chvmurthy ,Published On : March 23, 2019 / 07:35 AM IST
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ :పార్టీ ఫిరాయింపులపై అఖిల పక్షం 

హైదరాబాద్ : పోరాటాల ద్వారా తెచ్చుకున్నరాష్ట్రంలో, ఉద్యమాన్ని నడిపిన పోరాట యోధుడే రాజ్యాంగాన్ని ఖూనీ  చేస్తున్నాడని సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.  రాష్ట్రంలో ఏర్పడ బోయే రాజ్యాంగ సంక్షోభాన్ని కాపాడుకోవాల్సిన భాద్యత అందరిమీద ఉందని ఆయన అన్నారు. శాశ్వతంగా ఉండాల్సిన ప్రతిపక్షం, ప్రజాస్వామ్యం, అలాగే అభివృధ్ది కోసం నిధులు అన్నీ ఈ రాష్ట్రంలో అశాశ్వతంగా మారిపోయే ప్రమాదం ఉందని  భట్టి  హెచ్చరించారు.  ఇలా జరిగితే  రాష్ట్రంలో ప్రతి పౌరుడికి నష్టం జరుగుతుందని, పార్టీ ఫిరాయింపులపై   హైదరాబాద్ లో జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఆయన  అన్నారు. 
Read Also : పవన్‌ది ఆదర్శమే.. నామినేషన్ తిరస్కరిస్తే?‌

ప్రజలకు నష్టం కలగకుండా ఉండటం కోసం తాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేపడతానని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని, తద్వార ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా ఖూనీ చేస్తోంది తెలియజేస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాజ్యాంగ సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని విపక్ష పార్టీలకు పిలుపు ఇచ్చారు. ఈ అఖిల పక్ష సమావేశానికి ఎల్‌.రమణ, కోదండరాం, చాడ వెంకటరెడ్డి, వి.హనుమంతరావు‌, కుసుమ కుమార్‌, కంచె ఐలయ్య, పలు సంఘాల నాయకులు హజరయ్యారు.  
Read Also : వైసీపీ షాకింగ్ డెసిషన్ : హిందూపురం బరిలో గోరంట్ల మాధవ్ భార్య