ప్లీజ్, ఒక గంటైనా మద్యం షాపులు తెరవండి, సీఎం కేసీఆర్ కు మందుబాబుల రిక్వెస్ట్

తెలంగాణలో వైన్స్ షాపులు ఓపెన్ చేస్తారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరిగిన ప్రచారంతో మందుబాబులు వైన్స్ షాపులు ముందు బారులు తీరారు. ఆదివారం(మార్చి

  • Published By: veegamteam ,Published On : March 29, 2020 / 01:52 PM IST
ప్లీజ్, ఒక గంటైనా మద్యం షాపులు తెరవండి, సీఎం కేసీఆర్ కు మందుబాబుల రిక్వెస్ట్

తెలంగాణలో వైన్స్ షాపులు ఓపెన్ చేస్తారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరిగిన ప్రచారంతో మందుబాబులు వైన్స్ షాపులు ముందు బారులు తీరారు. ఆదివారం(మార్చి

తెలంగాణలో వైన్స్ షాపులు ఓపెన్ చేస్తారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరిగిన ప్రచారంతో మందుబాబులు వైన్స్ షాపులు ముందు బారులు తీరారు. ఆదివారం(మార్చి 29,2020) తమకు సమీపంలోని మద్యం దుకాణాల ముందు గుమికూడారు. వైన్స్ షాపులు తీస్తారేమోనని ఆశగా ఎదురు చూశారు. తీరా అది ఫేక్ న్యూస్ అని తెలిసి నిరాశ చెందారు. ఈ సందర్భంగా మందుబాబుల తమ గోడు వెళ్లబోసుకున్నారు. మందు దొరక్క ఇబ్బందులు పడుతున్నామన్నారు. మైండ్ పని చేయడం లేదన్నారు. మందు చుక్క పడకపోవడంతో కాళ్లు, చేతులు వణుకుతున్నాయని వాపోయారు. ప్రభుత్వం తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని, రోజుకు కనీసం ఒక గంటైనా వైన్స్ షాపులు తెరవాలని విజ్ఞన్తి చేశారు మద్యం ప్రియులు.

మద్యం దొరక్క ఆత్మహత్యలు:
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నాయి. తెలంగాణలో అన్ని షాపులు, వ్యాపారాలు బంద్ అయ్యాయి. మందు షాపులను కూడా బంద్ అయ్యాయి. దీంతో మద్యం దొరక్క మద్యం ప్రియులు పిచ్చెక్కిపోతున్నారు. కొందరు మతిస్తిమితం కోల్పోతున్నారు. కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు.

వైన్స్ షాపులు తెరుస్తారని అసత్య ప్రచారం:
ఈ పరిస్థితుల్లో తెలంగాణలో వైన్స్ షాపులు తెరుస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఇది నిజమనుకుని మందు బాబులు ఖుషీ అయ్యారు. దీనిపై అబ్కారీ శాఖ స్పందించింది. అది ఫేక్ న్యూస్ అని, అసత్య ప్రచారం అని స్పష్టం చేసింది. లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు తెలంగాణలో వైన్స్ షాపులు తెరిచే ప్రసక్తి లేదని అబ్కారీ శాఖ అధికారులు తేల్చి చెప్పారు. అంతేకాదు వైన్స్ షాపులు తెరుస్తారు అంటూ ప్రచారం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు అబ్కారీ శాఖ అధికారులు ఫిర్యాదు కూడా చేశారు.