అంబులెన్స్ డ్రైవర్ల దందా, పేషెంట్ల ముసుగులో హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణికుల తరలింపు, మనిషికి రూ.వెయ్యి వసూలు

కరోనా వైరస్ మహమ్మారి విస్తరించకుండా ముందు జాగ్రత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం(మార్చి 22,2020) దేశవ్యాప్తంగా జనతా

  • Published By: veegamteam ,Published On : March 23, 2020 / 09:58 AM IST
అంబులెన్స్ డ్రైవర్ల దందా, పేషెంట్ల ముసుగులో హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణికుల తరలింపు, మనిషికి రూ.వెయ్యి వసూలు

కరోనా వైరస్ మహమ్మారి విస్తరించకుండా ముందు జాగ్రత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం(మార్చి 22,2020) దేశవ్యాప్తంగా జనతా

కరోనా వైరస్ మహమ్మారి విస్తరించకుండా ముందు జాగ్రత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం(మార్చి 22,2020) దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించింది. అంటే అంతా ఇళ్లలోనే ఉండాలి. ఎవరూ బయటకు రాకూడదు. ప్రయాణాలు చేయకూడదు. అయితే అత్యవసర విభాగాలకు చెందిన వాహనాలను మాత్రం అనుమతిస్తామని చెప్పింది. ఇదే అదనుగా ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు రెచ్చిపోతున్నారు. పేషెంట్ల ముసుగులో ప్రయాణికులను అంబులెన్స్ డ్రైవర్లు తరలిస్తున్నారు. వాటిని అత్యవసర వాహనాలుగా భావిస్తున్న పోలీసులు వాటిని అడ్డుకోకుండా క్లియరెన్స్ ఇస్తున్నారు. కోదాడ దగ్గర ఈ దందా బయటపడింది.

హైదరాబాద్ నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి హైదరాబాద్ కు ప్రయాణికులను తరలిస్తున్నారు. ఒక్కో ప్రయాణికుడి నుంచి వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు. కొందరు రూ.2వేలు కూడా వసూలు చేస్తున్నారు. లాక్ డౌన్ ప్రకటించడంతో నగరవాసులు ఊరిబాట పట్టారు. అయితే పబ్లిక్ ట్రాన్స్ పోర్టు లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. పోలీసులు ప్రైవేట్ వాహనాలను కూడా అడ్డుకోవడంతో కొత్త దందా షురూ అయ్యింది. అంబులెన్స్ యజమానులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. పేషెంట్ల రూపంలో ప్రయాణికులను అంబులెన్స్ లో ఎక్కించుకుని తరలిస్తున్నారు.

ఈ దందా గురించి తెలుసుకుని పోలీసులు షాక్ తిన్నారు. ఇకపై అంబులెన్స్ లు కూడా చెక్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోదాడ దగ్గర ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్టులో ఈ దందా వెలుగుచూసింది. అంబులెన్స్ డ్రైవర్లపైనా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. మార్చి 31వ తేదీ వరకు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో నగరవాసులు ఇంటి బాట పట్టారు. నగరంలో ఉండి చేసేదేమీ లేదని అందుకే సొంతూళ్లకు వెళ్తున్నామని చెబుతున్నారు. అయితే పబ్లిక్ ట్రాన్స్ పోర్టు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయిస్తున్నారు. పోలీసులు వాటిని కూడా అడ్డుకోవడంతో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు ఈ దందాకు తెరతీశారు. డిమాండ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు.