ఐటీ గ్రిడ్ రచ్చ : కేటీఆర్ Vs నారా లోకేష్ ట్విట్టర్ వార్

  • Published By: madhu ,Published On : March 6, 2019 / 11:38 AM IST
ఐటీ గ్రిడ్ రచ్చ : కేటీఆర్ Vs నారా లోకేష్ ట్విట్టర్ వార్

తెలుగు రాష్ట్రాల మధ్య హాట్ హాట్ పొలిటిక్స్ జరుగుతున్నాయి. టీఆర్ఎస్, ఏపీ టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఐటీ గ్రిడ్, ఓటర్ల తొలగింపు విషయాలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ జగన్‌కు సహకరిస్తోందని, మోడీ, జగన్, కేసీఆర్‌‌లు ఏపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందంటూ…మరోసారి టీడీపీ అధికారంలోకి రాకుండా వీరంతా ప్రయత్నిస్తున్నారంటూ నేతలు ఆరోపణలు గుప్పిస్తుంటే..ఏపీ సీఎం బాబు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనితో ఇరు రాష్ట్రాల్లో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..ఏపీ మంత్రి నారా లోకేష్ మధ్య ట్వీట్ల వార్ కొనసాగుతోంది. ఏ నేరం చేయకపోతే ఉలికిపాటు ఎందుకు ? దొంగతనం బయటపడుతుంది అనే కదా మీ భయం అని కేటీఆర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా మరో ట్వీట్ చేశారు. 

‘కలువకుంట కాల్ సెంటర్ @ హైదరాబాద్. ఫోన్ నెంబర్లు : 040 30075005 / 38134000 హైదరాబాద్‌లో మా డేటా చోరీ చేశారు. ఇది నేరం కాదా ? హైదరాబాద్‌లోనే జగన్‌కు అందించారు. ఇది అప్రజాస్వామికం కాదా ? హైదరాబాద్ వైకాపా కాల్ సెంటర్ నుండే APలోని టీడీపీ కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేసే కాల్స్ చేస్తున్నారు. ఇది చట్టాల ఉల్లంఘన కిందకు రాదా ? ఇన్ని అక్రమాలు హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయి. మరి దీనిపై TS ప్రభుత్వం యాక్షన్ తీసుకోదా ? జగన్ @ktrtrs జోడి అనడానికి ఇంతకన్నా ఉదహారణ కావాలా ?’ అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా పోస్టు చేశారు. మరి దీనిపై కేటీఆర్ ఎలాంటి కౌంటర్ ఇస్తారో వెయిట్ అండ్ సీ.