మరో 24 గంటలు వర్షాలు

  • Published By: veegamteam ,Published On : April 23, 2019 / 04:52 AM IST
మరో 24 గంటలు వర్షాలు

హైదరాబాద్ : మండు వేసవిలో కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలలో పంటలకు తీవ్ర నష్టాలు వాటిల్లాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర  కర్ణాటక వరకు ఏర్పడిన ఉపరితలద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఈ  ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. మరో 24 గంటలు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవొచ్చని చెప్పారు. బుధవారం (ఏప్రిల్ 24)న  వాతావరణం పొడిగా ఉండే  అవకాశమున్నదని తెలిపారు. ఉపరితలద్రోణి కారణంగా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పగటి ఊష్ణోగ్రతలు కొంతమేర తగ్గాయి. జగిత్యాలలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా.. వరంగల్ అర్బన్ జిల్లాలో 37.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.