హైదరాబాద్ లో : 150 కిలోల బంగారంతో రామానుజ విగ్రహం

హైదరాబాద్‌కు మరో ఆకర్షణ..
రామానుజార్యుడి సహస్రాబ్ది వేడుకలు
చరిత్రలో తొలిసారిగా 150 కిలోల బంగారంతో రామానుజ విగ్రహం
216 అడుగుల ఎత్తైన రామానుజ విగ్రహం
1000 సంవత్సరాల వరకూ చెక్కుచెదరని రామానుజ ప్రతిమ
ప్లాస్టిక్‌తో త్రీడీ ప్రింటింగ్ చేయటం తొలి దశ
చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో తయారీ
అత్యాధునిక పరిజ్ఞానంతో విగ్రహ తయారీ
హైదరాబాద్ : విశిష్టాద్వైత తత్త్వవేత్త, వైష్ణవ భక్తి ఉద్యమసారధి భగవత్ రామానుజాచార్యులు. వ్యక్తిగత శ్రేయస్సు కన్నా సమాజ శ్రేయస్సే ముఖ్యమని చాటిచెప్పిన యోగి..ప్రజల ఆరాధ్యుడు రామానుజాచార్యుడు. ఈ క్రమంలో రామానుజార్యుడి సహస్రాబ్ది వేడుకల్లో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. సువర్ణ శోభితంతో 150 కిలోల పసిడితో రూపొందించిన రామానుజులవారి 216 అడుగుల ప్రతిమ చైనా నిపుణులతో హైదరాబాద్‌లోని త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో అత్యాధునిక పరిజ్ఞానంతో తయారు చేస్తున్నారు. రామానుజ విగ్రహం కింది భాగంలో ఉండే హాలులో ప్రతిష్టిస్తారు.
విగ్రహ ప్రత్యేకతలు
ప్రాజెక్టు ప్రధాన శిల్పి డీఎన్‌వీ ప్రసాద్ మాట్లాడుతు.. రామానుజాచార్యులవారి బంగారు విగ్రహం ఎత్తు 5 అడుగుల 3 అంగుళాలు. విగ్రహం కింద మూడు అడుగుల పీఠం ఉంటుంది. 1800 కిలోల రాగితో చేసిన రామానుజ విగ్రహానికి రెండు మిల్లీమీటర్ల సాంద్రత ఉన్న బంగారు తొడుగును అమరుస్తారని తెలిపారు.
ఈ విగ్రహం వెయ్యేళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉంటుందని అంచనా వేస్తున్ననమన్నారు. విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి రోజూ ఆరాధన చేయటానికి, శుద్ధ జలాలతో అభిషేకాలు చేయటానికి చిన్నజీయర్ స్వామి ప్రణాళిక రూపొందిస్తున్నారని, నిత్యం ఆరాధనలు అందుకున్నా ఏ మాత్రం జిలుగు తగ్గకుండా ఉండేలా దీనిని రూపొందిస్తున్నామని ప్రాజెక్టు ప్రధాన శిల్పి డీఎన్‌వీ ప్రసాద్ తెలిపారు.
ప్రధాని మోదీని ఆహ్వానించిన చినజీయర్ స్వామి
వైష్ణవ భక్తి ఉద్యమసారధి భగవత్ రామానుజుల సహస్రాబ్ది సందర్భంగా హైదరాబాద్‌లో నెలకొల్పనున్న ఆయన భారీ పంచలోహ విగ్రహ ఆవిష్కరణకు రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ఆహ్వానించారు.