ఇంటర్ రగడ : రీ వెరిఫికేషన్‌కు స్వతంత్ర సంస్థ

  • Published By: madhu ,Published On : May 2, 2019 / 03:04 AM IST
ఇంటర్ రగడ : రీ వెరిఫికేషన్‌కు స్వతంత్ర సంస్థ

తెలంగాణ ఇంటర్ మీడియట్ మంటలు ఇంకా చల్లారడం లేదు. రాజకీయ పార్టీలతోపాటు విద్యార్థి, యువజన సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. మే 02వ తేదీ గురువారం రాజకీయ పార్టీలతోపాటు విద్యార్ధి సంఘాలు పలు నిరసనలు చేపట్టనున్నాయి. బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఇదిలా ఉంటే..పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల జవాబు పత్రాల రీ వెరిఫికేషన్ చేయాలని బోర్డు నిర్ణయించింది. అయితే..వాటి ప్రాసెసింగ్ కోసం మరో స్వతంత్ర సంస్థను నియమించింది. గ్లోబరీనా సంస్థకు సమాంతరంగా మరో సంస్థ చేత రీ వెరిఫికేషన్ చేయించేలా ఏర్పాట్లు చేస్తోంది. 

స్వతంత్ర సంస్థ ఎంపిక బాధ్యత రాష్ట్ర టెక్నాలాజికల్ సర్వీసెస్‌కు అప్పగించింది. ఈ ప్రక్రియ ఒకటి..రెండు రోజుల్లో పూర్తి కానుందని తెలుస్తోంది. ఇంటర్ ఫలితాల్లో తప్పులపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ సూచనల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. 3.28 లక్షల మంది విద్యార్థులకు చెందిన దాదాపు 11 లక్షల జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్ చేసేందుకు బోర్డు రెడీ అయ్యింది.

48 వేల 960 మంది స్టూడెంట్స్ తమకు తక్కువ మార్కులు వచ్చాయంటూ రీ వెరిఫికేషన్ చేయాలని బోర్డుకు దరఖాస్తు పెట్టుకున్నారు. మరో 10 వేల 576 మంది రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 1, 13, 339 జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. లెక్చరర్ల ఆధ్వర్యంలో రీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత  గ్లోబరీనాతో పాటు కొత్త కంప్యూటర్ సంస్థ ఆధ్వర్యంలో సమాంతరంగా రీ వెరిఫికేషన్ ఫలితాల ప్రాసెసింగ్‌ను బోర్డు చేపట్టనుంది. 
Also Read : టీఎస్ ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు