మళ్లీ చలి పంజా : 4 రోజులు గజగజ

  • Published By: veegamteam ,Published On : January 9, 2019 / 04:58 AM IST
మళ్లీ చలి పంజా : 4 రోజులు గజగజ

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో చలి మరోసారి పంజా విప్పింది. జనవరి 8,9 తేదీలలో ఉష్ణ్రోగ్రతల శాతం పడిపోయాయి. దీంతో మళ్లీ చలిగాలులు పెరిగాయి. 10వ తేదీన ఆదిలాబాద్ లో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, హైదరాబాద్ లో 14, రామగుండంలో 12, హన్మకొండలో 13, విజయవాడలో 15, విశాఖపట్నంలో 13, తిరుమలలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. డిసెంబర్ చివరి వారం..తరువాత జనవరిలో రెండు, మూడు రోజుల తరువాత స్వల్పంగా తగ్గిన చలి మళ్లీ 8వ తేదీనుండి  నుంచి తన పంజాను విసురుతోంది. 

8,9 లలో  రాత్రి సమయంలో  భారీగా మంచు కురవటంతో చలిగాలులు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడు నాలుగు రోజుల పాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందని, ఆపై నెమ్మదిగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశం నిర్మలంగా ఉండటమే చలి పెరగడానికి కారణమని, ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులు కూడా ఇబ్బందులు పెడుతున్నాయని, మరికొన్ని రోజులు వృద్ధులు, చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరించారు.