బినామీ ఆస్తులు లేవు : తప్పు చేస్తే అరెస్టుకు సిద్ధం – మధుసూధన్ రెడ్డి

  • Published By: madhu ,Published On : October 4, 2019 / 08:51 AM IST
బినామీ ఆస్తులు లేవు : తప్పు చేస్తే అరెస్టుకు సిద్ధం – మధుసూధన్ రెడ్డి

ఏ తప్పు చేయలేదు..తనకు బినామీ ఆస్తులుంటే..ప్రభుత్వం జప్తు చేసుకోవచ్చంటున్నారు తెలంగాణ ఇంటర్ జేఏసీ నేత, ప్రభుత్వ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు మధుసూధన్ రెడ్డి. ఏసీబీ జరుపుతున్న దాడులపై అక్టోబర్ 04వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ…

ఈ రైడ్ ఎందుకు జరుగుతుంది ? కారణాలు ఏంటీ ? ఎందుకు నన్ను టార్గెట్ చేశారు ? ఎవరు టార్గెట్ చేశారు..ఇలాంటి అనే ప్రశ్నలకు తాను ఇప్పుడే సమాధానం చెప్పనన్నారు. అధ్యాపకుల సంఘం నాయకుడిగా..అనేక విషయాలపై మాట్లాడినట్లు చెప్పారు. అయితే..తన దగ్గర రూ. 50 లక్షలు దొరికినట్లు ప్రచారం జరుగుతోందని..ఇది వాస్తవం కాదన్నారు. కేవలం తన దగ్గర లక్ష రూపాయలు మాత్రమే ఉన్నట్లు..అలాగే ఫ్యామిలీ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ తప్పా ఐదు రూపాయలు ఎక్కువ లేవన్నారు. ఈ విషయాలు ఏసీబీ వారు చెబుతారన్నారు. అంతకుమించి ఎక్కువగా డబ్బులు ఉంటే..అరెస్టుకు సిద్ధమని ప్రకటించారు. బినామీ అనే ఆలోచన రాదని..అలాంటి అవకాశం లేదని కొట్టిపారేశారు. మహేందర్ ఎవరో తనకు తెలియదన్నారు. 

మధుసూధన్ రెడ్డిపై ఏసీబీ అధికారులు దాడులు చేయడం కలకలం రేపింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో దిల్ సుఖ్ నగర్ లోని ఆయన నివాసంలో సోదాలు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఇంటితో పాటు బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. పలు డ్యాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు.  మధుసూదన్ రెడ్డి తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడిగా చాలా కాలంగా పనిచేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి పదవిలో ఉన్నారు. 2007 ఇంటర్ పేపర్ లీకేజ్ లో మధుసూదన్ రెడ్డిని కీలక సూత్రధారిగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. 3 ప్రైవేట్ కాలేజీలతో కుమ్మక్కయ్యారని, మార్క్స్ మేనేజ్ చేశారని.. ప్రమోషన్ల పేరుతో జూనియర్ లెక్చరర్ల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.