విమానంలో నొప్పులు.. శంషాబాద్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఆల్ హ్యాపీస్

విమానంలో నొప్పులు.. శంషాబాద్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఆల్ హ్యాపీస్

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో శనివారం అరుదైన ఘటన చోటు చేసుకుంది. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి గర్భిణీ ప్రసవానికి వీలు కల్పించారు. దీంతో ఆ మహిళ ఓ మగ పిల్లాడికి జన్మనిచ్చింది.  శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దుబాయ్ నుంచి మనీలా వెళ్తున్న సీబు ఫస్ట్ వీక్ ఎయిర్ లైన్స్ ఎయిర్‌పోర్టు ట్రాఫిక్ కంట్రోల్ అనుమతితో అత్యవసర ల్యాండింగ్ అయింది. 
 
విమానంలో మనీలా కు చెందిన సెరిడా అనే మహిళకు పురుటి నొప్పులు  రావడం మొదలవడంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఎయిర్‌పోర్టుకు సమాచారం అందించడంతో విమానాశ్రయంలో ఉన్న మెడికల్ సెంటర్ రెడీ చేశారు. అక్కడే మహిళ ప్రసవం కావడం, పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. 

తదుపరి చికిత్స కోసం జూబ్లీ హిల్స్‌లో ఉన్న అపోలో హాస్పిటల్‌కు తల్లిని, శిశువును పంపించారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు.