జీహెఎంసీ వార్నింగ్ : పావురాలకు దాణా వేస్తే ఫైన్

మనుషులకు ప్రమాదం పొంచి ఉంది. ప్రాణాంతకమైన రోగాలకు కారణమవుతున్నాయి. చారిత్రక కట్టడాలు కూడా పాడైపోతున్నాయి. వీటన్నింటికి కారణం పావురం. అవును

  • Edited By: veegamteam , October 29, 2019 / 06:22 AM IST
జీహెఎంసీ వార్నింగ్ : పావురాలకు దాణా వేస్తే ఫైన్

మనుషులకు ప్రమాదం పొంచి ఉంది. ప్రాణాంతకమైన రోగాలకు కారణమవుతున్నాయి. చారిత్రక కట్టడాలు కూడా పాడైపోతున్నాయి. వీటన్నింటికి కారణం పావురం. అవును

మనుషులకు ప్రమాదం పొంచి ఉంది. ప్రాణాంతకమైన రోగాలకు కారణమవుతున్నాయి. చారిత్రక కట్టడాలు కూడా పాడైపోతున్నాయి. వీటన్నింటికి కారణం పావురం. అవును పావురాల కారణంగా అనేక సమస్యలు వస్తున్నాయని.. వీటికి చెక్ పెట్టాలని జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ణయించుకున్నారు. పావురాల తరలింపుపై అధికారులు ఫోకస్ పెట్టారు. వాటిని పట్టుకుని అడవుల్లో వదిలేస్తున్నారు.

పలు రకాల ఇన్‌ఫెక్షన్లను వ్యాప్తి చేస్తూ భాగ్యనగర వాసులకు ప్రాణాంతకంగా మారిన పావురాలను జీహెచ్‌ఎంసీ అధికారులు అటవీ ప్రాంతాలకు తరలించారు. మొజాంజాహీ మార్కెట్ దగ్గర 500 పావురాలను పట్టుకొని శ్రీశైలం అడవుల్లో వదిలేశారు.

అదే సమయంలో పావురాలకు దాణా వేయడంపైనా నిషేధం విధించారు. పావురాలకు దాణా వేస్తే ఫైన్ వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మోజాంజాహి మార్కెట్‌లో పావురాల ఫీడింగ్‌కు విక్రయిస్తున్న జొన్నలను వెటర్నరీ విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జీహెచ్‌ఎంసీకి చెందిన అన్ని ఉద్యానవనాల్లో పావురాలకు ఫీడింగ్ (ఆహార గింజలు వేయడం)ను గతంలోనే నిషేధించారు. మిగిలిన పావురాలను కూడా అటవీ ప్రాంతంలో వదిలేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. పావురాలు భాగ్యనగర చారిత్రక వారసత్వ కట్టడాలను పాడు చేయడమే కాకుండా పలు రకాల వైరస్‌లను వ్యాప్తి చేస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా వీటి వల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు.

పావురాలను రోగాల పుట్టలుగా నిపుణులు అభివర్ణించారు. 60 రకాల వ్యాధులకు కారకమయ్యే వీటికి దూరంగా ఉండటమే మేలంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 6 లక్షలకుపైగా ఉన్న పావురాల సంఖ్య రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పావురాల రెక్కల నుంచి వచ్చే ధూళి, వాటి విసర్జితాల వల్ల ప్రజలకు చికిత్సకు కూడా సాధ్యంకాని రోగాలు సోకే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

అయితే పావురాలను శ్రీశైలంలో వదిలేశామని ప్రశాంతంగా ఉండేందుకు అవకాశం లేదంటున్నారు. ఎందుకంటే ఈ భూమి మీద ఎక్కడ వదిలినా తిరిగి సొంత ప్రదేశానికి రాగలిగే గ్రాహక శక్తి వాటికి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల అవి తిరిగి వచ్చే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

హైదరాబాద్ లోనే కాదు ముంబైలోనూ పావురాల సంఖ్య గణనీయంగా పెరిగింది. అక్కడ నమోదవుతున్న ప్రతి పది ఆస్తమా కేసుల్లో ఒకటి పావురాల వల్లే వస్తున్నట్టు తేలడంతో వాటికి ఫ్యామిలీ ప్లానింగ్‌ చేయాలని బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) నిర్ణయించింది. ఓవిస్టాప్‌ అనే సంతానోత్పత్తి నియంత్రణ ఔషధంతో పావురాల సంఖ్యను సమర్థంగా అరికట్టవచ్చని నిపుణులు తెలిపారు.