బండి సంజయ్ వెహికల్‌కే రూ.46వేల ఫైన్

బండి సంజయ్ వెహికల్‌కే రూ.46వేల ఫైన్

తెలంగాణ రాజధాని హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా గతంలో లేనన్ని డివిజన్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఎంఐఎం.. బీజేపీతో హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఈ క్రమంలో 10టీవీ లైవ్ డిబేట్ లో మాట్లాడిన రాజకీయ ప్రముఖులు ఇరు పక్షాల నాయకులపై వ్యక్తిగత విమర్శలకు దిగారు.

ఈ క్రమంలో కేంద్రంలో అధ్యక్షతన ఉండే బీజేపీ తీసుకొచ్చిన సెంట్రల్ యాక్ట్ ని బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫాలో అవడం లేదని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. స్వయంగా అతని వాహనానికే రూ.46వేలకు పైగా ఫైన్ ఉందని అన్నారు.

 

<script async src=”https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js”></script>
<ins class=”adsbygoogle”
style=”display:block; text-align:center;”
data-ad-layout=”in-article”
data-ad-format=”fluid”
data-ad-client=”ca-pub-6458743873099203″
data-ad-slot=”1057226020″></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

మరోవైపు గ్రేటర్ ఫలితాలపై జాతీయ మీడియా కూడా ఫోకస్ చేసింది. టైమ్స్ నౌ, ఎన్డీటీవీ, ఆజ్ తక్, ఇండియా టుడేలు సైతం అధికా ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. జాతీయ స్థాయి నాయకులు అమిత్ షా, జేపీ నడ్డాలతో పాటు ఇతర రాష్ట్రాల నేతలు యోగి ఆదిత్య నాథ్, స్మృతి ఇరానీలు ప్రచార సమయంలో హైదరాబాద్ రావడంతో ఎన్నికల ఫలితాలకు క్రేజ్ పెరిగింది.