ఐదవ రోజు అట్ల బతుకమ్మ సంబురాలు

  • Published By: veegamteam ,Published On : October 2, 2019 / 02:41 AM IST
ఐదవ రోజు అట్ల బతుకమ్మ సంబురాలు

తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికీ సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ పండుగ సంబురాలు. 9 రోజుల పాటు తెలంగాణలోని వాడ వాడలా ఎక్కడ చూసినా పూల సందడే కనిపిస్తుంది. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే బతుకమ్మ సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.  ఇప్పటికే నాలుగురోజుల బతుకమ్మ వేడుకల్లో ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ వేడుకలు ముగిశాయి. 

ఇక బతుకమ్మ పండుగలో ఐదవ రోజు జరుపుకునే వేడుకను ‘అట్ల బతుకమ్మ’ అంటారు. అట్ల బతుకమ్మ పండుగ రోజున తంగేడు, గునుగు,చామంతి,మందార, గుమ్మడి పూలను ఐదు అంతరాలుగా పేర్చి బతుకమ్మను తయారుచేసి ఆరాధిస్తారు. ఆట పాటలతో వేడుక చేసుకుంటారు.  పిండితో చేసిన అట్లను వాయనంగా పెడతారు. ఆడపడచులంతా సాయంత్రం బతుకమ్మ ఆడి, పాడి నీటిలో నిమజ్జనం చేసిన తరువాత అట్లను ప్రసాదాన్ని పంచుకుంటారు.