చైతన్యం వచ్చింది :  పోలింగ్ బహిష్కరించిన గ్రామస్తులు

మాకు డబ్బులొద్దు - ఉపాధి కావాలి అంటూ గ్రామంలో ర్యాలీ తీశారు. స్పష్టమై హామీ లేకుంటే, అధికారులు మా గోడు పట్టకపోతే

  • Published By: veegamteam ,Published On : April 10, 2019 / 06:37 AM IST
చైతన్యం వచ్చింది :  పోలింగ్ బహిష్కరించిన గ్రామస్తులు

మాకు డబ్బులొద్దు – ఉపాధి కావాలి అంటూ గ్రామంలో ర్యాలీ తీశారు. స్పష్టమై హామీ లేకుంటే, అధికారులు మా గోడు పట్టకపోతే

తెలంగాణలో పార్లమెంట్ ఓటింగ్ కోసం సర్వం సిద్ధం అవుతుంది. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిస్తున్నాయి పార్టీలు, ఈసీ. ఈసారి పోలింగ్ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు భద్రాద్రి కొత్తగూడెంలోని గరిమెళ్లపాడు గ్రామస్తులు. ఇక్కడ 2వేల వరకు ఓట్లు ఉన్నాయి. ఈసారి ఏ పార్టీకి కూడా ఓటు వేసేది లేదని అంటున్నారు. మేం ఎవరికీ ఓటు వేయం అంటూ బ్యానర్లు ప్రదర్శించారు.
Read Also : సమంత పిలుపు : ఆ టీడీపీ అభ్యర్థిని గెలిపించండి

మాకు డబ్బులొద్దు – ఉపాధి కావాలి అంటూ గ్రామంలో ర్యాలీ తీశారు. స్పష్టమై హామీ లేకుంటే, అధికారులు మా గోడు పట్టకపోతే మేము ఎవరికీ ఓటు వేయం అంటూ గ్రామం మొత్తం ఒకే మాటపై నిలబడింది. గ్రామంలో బ్యానర్లు ప్రదర్శించారు. గ్రామంలో పోలింగ్ ఏర్పాట్లు చేస్తున్న ఎన్నికల సిబ్బందికి ఇది షాక్. బూత్ లు ఏర్పాటు చేసినా.. ఎవరూ రాకపోతే ఎలా అంటూ ఓటర్లను బుజ్జగిస్తున్నారు. 

ఇక పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఎవరికి వారు హామీలు ఇస్తున్నారు. గ్రామం మొత్తం మా పార్టీకి ఓటేస్తే.. మీకు ఉపాధి హామీ మేం కల్పిస్తాం అని భరోసా ఇస్తున్నారు. పోలింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని నమ్మేది ఎలా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. బాండ్ పేపర్ పై రాసి ఇవ్వాలని రాజకీయ పార్టీలను కోరుతున్నాయి. నేతలు కూడా షాక్ అయ్యారు. ఓటు రోజు ఇచ్చే 5, 10వేలు వద్దని.. ఉపాధి కావాలని కోరుతున్నారు. పని కల్పిస్తే మా బతుకు మేం బతుకుతాం.. 365 రోజులు హ్యాపీగా ఉంటాం అంటున్నారు ప్రజలు. 
Read Also : పోల్ జర్నీ : టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ రద్దీ