గుర్తుకొస్తున్నాయి : వీహబ్ దేశానికే స్ఫూర్తి

  • Published By: veegamteam ,Published On : March 29, 2019 / 09:55 AM IST
గుర్తుకొస్తున్నాయి : వీహబ్ దేశానికే స్ఫూర్తి

హైదరాబాద్: ఉత్సాహవంతులైన మహిళలను చూస్తుంటే నలభై ఏండ్ల క్రితం వ్యాపారం ప్రారంభించిన రోజులు గుర్తుకొస్తున్నాయని బయోకాన్ చైర్‌పర్సన్, ఎండీ కిరణ్ మజుందార్‌షా అన్నారు. జూబ్లీహిల్స్‌లో వీహబ్ ఆఫీసును ప్రారంభించిన మంజుదార్ షా తెలంగాణ ఏర్పడిన స్వల్పకాలంలోనే వీహబ్ వంటి ఆవిష్కరణల వేదిక ఏర్పాటు కావడం హర్షణీయమన్నారు. ఈ కృషి దేశవ్యాప్తంగా కొనసాగితే మహిళల ప్రతిభాపాటవాలు వెల్లివిరుస్తాయని ఆమె ఆకాంక్షంచారు. మహిళగా వ్యాపారంలో అడుగుపెట్టడాన్ని తన తండ్రి ప్రోత్సహించారని..అటువంటి స్ఫూర్తి సమాజంలో పెరగాలని కోరారు. దేశం ఆర్థికాభివృద్ధి సాధించటంలో మహిళలు సమర్థత చాలా అవసరమన్నారు. 
 

మహిళా పారిశ్రామికవేత్తలను..ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన వీహబ్ పనితీరుపై బయోకాన్ చైర్‌పర్సన్, ఎండీ కిరణ్ మజుందార్‌షా ప్రశంసల జల్లు కురిపించారు. వీహబ్  దేశానికి స్ఫూర్తిదాయకంగా ఉందని కొనియాడారు.  మహిళల కోసం వీహడ్ ద్వారా ఇస్తున్న ప్రోత్సహం స్ఫూర్తిదాయకమన్నారు. ఉద్యోగంకోసం ఎదురు చూడకుండా..తమలోని ప్రతిభను గుర్తించి స్వతంత్రంగా ఆలోచించిన నాడు ప్రతీ మహిళా మంచి వ్యాపారవేత్తగా తయారవుతున్నారని..అప్పుడే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లక్షణాలు ప్రారంభమవుతాయని, మహిళలు నైపుణ్యాలు పెంచుకోవడంతోపాటు, తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నదని కిరణ్ మజుందార్‌షా అన్నారు.