మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి : తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే

బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం కొలిక్కి వచ్చింది. 182మందితో బీజేపీ హైకమాండ్ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది. ఇందులో తెలంగాణలో బీజేపీ తరఫున పోటీ చేయబోయే

  • Published By: veegamteam ,Published On : March 21, 2019 / 03:43 PM IST
మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ,  సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి : తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే

బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం కొలిక్కి వచ్చింది. 182మందితో బీజేపీ హైకమాండ్ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది. ఇందులో తెలంగాణలో బీజేపీ తరఫున పోటీ చేయబోయే

బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం కొలిక్కి వచ్చింది. 182మందితో బీజేపీ హైకమాండ్ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది. ఇందులో తెలంగాణలో బీజేపీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించింది. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు గాను 10 స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేశారు. మరో 7 స్థానాలకు అభ్యర్థులను పెండింగ్ లో ఉంచారు.

ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన డీకే అరుణ మహబూబ్ నగర్ నుంచి బరిలోకి దిగనున్నారు. సికింద్రాబాద్‌లో సిట్టింగ్ ఎంపీ దత్తాత్రేయ స్థానంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని బరిలో నిలిపారు. నిజామాబాద్ నుంచి డీఎస్ కుమారుడు డి.అరవింద్, మల్కాజ్‌గిరి నుంచి ఎమ్మెల్సీ రాంచందర్ రావు పేర్లు ఖరారయ్యాయి.

* సికింద్రాబాద్ – కిషన్ రెడ్డి
* మహబూబ్ నగర్ – డీకే అరుణ
* కరీంనగర్ – బండి సంజయ్
* మల్కాజ్ గిరి – ఎన్.రాంచందర్ రావు
* నిజామాబాద్ – ధర్మపురి అరవింద్
* నాగర్ కర్నూల్ – బంగారు శృతి
* భువనగిరి – పీవీ శ్యామసుందర్ రావు
* వరంగల్ – సాంబమూర్తి
* మహబూబాబాద్ – హుస్సేన్ నాయక్
* నల్గొండ – జితేంద్రకుమార్

అభ్యర్థులను ప్రకటించాల్సిన స్థానాలు చేవెళ్ల, పెద్దపల్లి, ఖమ్మం, హైదరాబాద్, ఆదిలాబాద్, జహీరాబాద్, మెదక్. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల కోసం ఈ స్థానాలను బీజేపీ హైకమాండ్ పెండింగ్ లో ఉంచినట్టు సమాచారం.