సీఎం కేసీఆర్.. ఓటుకి రూ.30వేలు.. వార్డుకి రూ.కోటి ఇచ్చారు

మున్సిపల్‌ ఎన్నికల్లో దారుణ ఓటమి గురైన విపక్షాలు సర్కార్‌పై తమ అక్కసు వెళ్లగక్కాయి. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించాయి. ఈ

  • Published By: veegamteam ,Published On : January 26, 2020 / 03:44 AM IST
సీఎం కేసీఆర్.. ఓటుకి రూ.30వేలు.. వార్డుకి రూ.కోటి ఇచ్చారు

మున్సిపల్‌ ఎన్నికల్లో దారుణ ఓటమి గురైన విపక్షాలు సర్కార్‌పై తమ అక్కసు వెళ్లగక్కాయి. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించాయి. ఈ

మున్సిపల్‌ ఎన్నికల్లో దారుణ ఓటమి గురైన విపక్షాలు సర్కార్‌పై తమ అక్కసు వెళ్లగక్కాయి. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ధన ప్రవాహం కొనసాగించిందని విమర్శించాయి. ఐతే.. విపక్షాల ఆరోపణలకు సీఎం కేసీఆర్‌ గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు. తమ పార్టీలో క్రమశిక్షణ ఉందని.. ఎవరూ ఎలాంటి ప్రలోభాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. అనవసర ఆరోపణలతో ఓట్లేసిన ప్రజలను అవమానించొద్దని హితవు పలికారు సీఎం కేసీఆర్‌. 

9

 

ఓటుకి రూ.30వేలు:
మున్సిపల్‌ ఎన్నికల్లో కారు జోరును అడ్డుకోలేక చతికిలపడ్డ విపక్షాలు.. అధికార పార్టీపై విమర్శల పర్వానికి తెరతీశాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీఆర్‌ఎస్‌ విజయం సాధించిందని ఆరోపించాయి. ఓటర్లను ప్రలోభపెట్టి.. డబ్బులు వెదజల్లి ఈ ఎన్నికల్లో అనైతికంగా గెలిచిందని మండిపడ్డాయి. మున్సిపల్‌ ఎన్నికల్లో చోటుచేసుకున్న అక్రమాల వల్లే బీజేపీ ఓటమి చెందిందన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. ఒక్కో వార్డుకు కోటి రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. కొన్నిచోట్ల ఓటు 5 వేల 30 వేల రూపాయల వరకు పలికిందన్నారు. డబ్బు వెదజల్లడంతో పాటు టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని లక్ష్మణ్‌ ఆరోపించారు. 

22

బ్లాక్ మెయిల్ చేసి గెలిచారు:
మరోవైపు ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడ్డారని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 123 మున్సిపాలీటీలు, 10 మున్సిపల్‌ కార్పొరేషన్లలో టీఅర్‌ఎస్‌ను గెలిపించే బాధ్యతను మంత్రులకు సీఎం అప్పగించడం ద్వారా బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడ్డారని అన్నారు. ప్రజలను, ప్రతిపక్షాలను బెదిరించి… డబ్బును వెదజల్లి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిచిందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు కాంగ్రెస్‌ కృషి చేసిందన్నారు.

55

ఒక్క రూపాయి కూడా పంచలేదు:
విపక్షాల ఆరోపణలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు సీఎం కేసీఆర్‌. ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్న ప్రతిపక్షాల విమర్శలపై మండిపడ్డారు. టీఆర్ఎస్‌లో క్రమశిక్షణ ఉందని.. ఎవరూ ఎలాంటి ప్రలోభాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. తాను అసలు ప్రచారానికి వెళ్ల లేదని.. మంత్రులు కూడా ఎవరి ప్రాంతాల్లో వాళ్లే ప్రచారం చేసుకున్నారన్నారు. అనవసర ఆరోపణలతో ఓట్లేసిన ప్రజలను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే.. హోదాకు మించి అధిక ప్రసంగాలు చేస్తే ప్రజలు ఇలాగే బుద్ధి చెప్తారని చురకలంటించారు సీఎం కేసీఆర్‌.

k

* మున్సిపల్‌ ఎన్నికల్లో చతికిలపడ్డ విపక్షాలు
* సర్కార్‌పై విమర్శల పర్వానికి తెరలేపిన ప్రతిపక్షాలు
* టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శలు
* డబ్బులు వెదజల్లి ఎన్నికల్లో విజయం సాధించిందని ఆరోపణలు

1

* విపక్షాల ఆరోపణలకు కౌంటర్‌ అటాక్‌ ఇచ్చిన సీఎం కేసీఆర్‌
* టీఆర్‌ఎస్‌ ఎలాంటి ప్రలోభాలకు పాల్పడలేదని వివరణ
* ఓట్లేసిన ప్రజలను అవమానిస్తున్నారని ఆగ్రహం