ఏబీవీపీ నాయకులపై దాడులకు సూత్రధారి జార్జిరెడ్డి : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

జార్జిరెడ్డి సినిమా విడుదలకు ముందే వివాదానికి దారితీసింది. సినిమాని కాంట్రవర్సీలు చుట్టుముట్టాయి. కొన్ని వర్గాలు అనుకూలంగా, కొన్ని వర్గాలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి.

  • Published By: veegamteam ,Published On : November 19, 2019 / 01:49 PM IST
ఏబీవీపీ నాయకులపై దాడులకు సూత్రధారి జార్జిరెడ్డి : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

జార్జిరెడ్డి సినిమా విడుదలకు ముందే వివాదానికి దారితీసింది. సినిమాని కాంట్రవర్సీలు చుట్టుముట్టాయి. కొన్ని వర్గాలు అనుకూలంగా, కొన్ని వర్గాలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి.

జార్జిరెడ్డి సినిమా విడుదలకు ముందే వివాదానికి దారితీసింది. సినిమాని కాంట్రవర్సీలు చుట్టుముట్టాయి. కొన్ని వర్గాలు అనుకూలంగా, కొన్ని వర్గాలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. సినిమాను అడ్డుకుంటామని కొందరు చేస్తున్న హెచ్చరికలు ఉద్రిక్తతకు దారితీశాయి. తాజాగా ఈ సినిమాపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటుగా స్పందించారు. జార్జిరెడ్డి ట్రైలర్ పై ఆయన విరుచుకుపడ్డారు. సినిమా ముసుగులో తమ సంఘాలపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. జార్జిరెడ్డి సినిమాపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న రాజాసింగ్.. సినిమాలో నిజానిజాలు మాత్రమే చూపెట్టాలన్నారు. జార్జిరెడ్డి హత్య సమయంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఆయన గుర్తు చేశారు.

జార్జిరెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను జార్జిరెడ్డి స్నేహితుడు ప్రదీప్ ఖండించారు. 1970లో ఓయూలో ఎన్ఎస్ యూఐ, ఏబీవీపీ మాత్రమే ఉండేవన్నారు. జార్జిరెడ్డి వచ్చాక వాళ్ల ప్రాబల్యం తగ్గిందన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకే జార్జిరెడ్డి హీరో అయ్యాడని చెప్పారు. జార్జిరెడ్డి సినిమాలో నిజాలు చూయించారని ఆశిస్తున్నామన్నారు.

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో వివక్షకు గురైన విద్యార్థులకు అండగా నిలిచి, వారి తరఫున పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన విద్యార్థి నాయకుడి కథే ‘జార్జిరెడ్డి’ అని చిత్రయూనిట్ చెబుతోంది. కాగా బయోపిక్‌పై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా ఓ వర్గానికి చెందిన ఓయూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఒక దుర్మార్గుడిని, సంఘవిద్రోహ శక్తిని హీరోగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని వారు వాదిస్తున్నారు. జార్జిరెడ్డి అసలు కథ ఇదీ అంటూ సోషల్ మీడియాలో ఒక స్టోరీ బాగా వైరల్ అవుతోంది. జార్జిరెడ్డి ఎవరు? ఓయూలోకి అడుగుపెట్టిన తర్వాత పరిస్థితులు ఎలా మారాయి? వంటి విషయాలను ఈ కథనంలో తెలిపారు.