బ్రేకింగ్:  ప్రేమోన్మాది భరత్ అరెస్ట్

  • Published By: chvmurthy ,Published On : February 6, 2019 / 11:05 AM IST
బ్రేకింగ్:  ప్రేమోన్మాది భరత్ అరెస్ట్

హైదరాబాద్: బర్కత్ పురాలో మధులిక అనే మైనర్ బాలిక పై  ప్రేమ పేరుతో  దాడి చేసిన ప్రేమోన్మాది భరత్ ను పోలీసులు అరెస్టు చేసారు. ఈ సాయంత్రం అతడ్ని మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. భరత్ చేసిన దాడిలో మొత్తం 15 చోట్ల బాలిక శరీరం పై గాయాలయ్యాయని, చికిత్సకు శరీరం సహకరించటంలేదని డాక్టర్లు చెపుతున్నారు. వెంటిలేషన్ పై ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని,  72 గంటలు గడిస్తే కానీ పరిస్ధితి ఏమీ చెప్పలేమని మలక్ పేట యశోదా ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు.

ఈస్ట్ జోన్  డిప్యూటీ కమీషనర్  ఆధ్వర్యంలో, 4 టీమ్ ల ద్వారా గాలింపు జరిపి  కాచిగూడ ప్రాంతంలోని ఒక ఇంటిలో తలదాచుకున్న భరత్ ను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికపై దాడి చేసిన తర్వాత  నిందితుడు కాచిగూడ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరించటం, భరత్ సంచరించిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజి ఆధారంగా భరత్ కదలికలు కనిపెట్టిన పోలీసులు  ఒక ఇంటిలో తలదాచుకున్న భరత్ ను అదుపులోకి తీసుకున్నారు.  మధులిక పై దాడి చేసేందుకు ఉపయోనగించిన కొబ్బరి బొండాల కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.భరత్ సెల్ పోను ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.