నిరుద్యోగ భృతికి రూ.1,810 కోట్లు కేటాయింపు

నిరుద్యోగ భృతి కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. ఒక వెయ్యి 810 కోట్లు నిధుల కేటాయించింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సీఎం కేసీఆర్ ప్రకటించారు.

  • Published By: vamsi ,Published On : February 22, 2019 / 07:15 AM IST
నిరుద్యోగ భృతికి రూ.1,810 కోట్లు కేటాయింపు

నిరుద్యోగ భృతి కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. ఒక వెయ్యి 810 కోట్లు నిధుల కేటాయించింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సీఎం కేసీఆర్ ప్రకటించారు.

నిరుద్యోగ భృతి కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. ఒక వెయ్యి 810 కోట్లు నిధులు కేటాయించింది. అసెంబ్లీలో శుక్రవారం (ఫిబ్రవరి 22, 2019) ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఒక్కో నిరుద్యోగికి రూ.3 వేల 016 ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ప్రకటించిన హామీకి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేశారు.

విధివిధానాలు అధ్యయనం చేయటం కోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా వెల్లడించారాయన. త్వరలోనే వారికి ఈ నిధుల నుంచి భృతి అందించనున్నట్లు తెలిపారు. విధివిధానాల రూపకల్పన కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. తాత్కాలిక బడ్జెట్‌లో రూ.1810 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. పూర్తి బడ్జెట్ లో నిధులను మరింత పెంచే అవకాశం కూడా లేకపోలేదు.

Read Also: తెలంగాణ బడ్జెట్ : కళ్యాణ లక్ష్మి రూ.1,450 కోట్లు
Read Also: ఆరోగ్య తెలంగాణ : ENT, దంత పరీక్షల కోసం రూ.5వేల కోట్లు
Read Also: తెలంగాణ బడ్జెట్ : ఆసరా పెన్షన్స్ రూ.12 వేల 67 కోట్లు