చీమ చిటుక్కుమన్నా పట్టేస్తారు : సాగర్ చుట్టూ 250 సీసీ కెమెరాలు

  • Published By: madhu ,Published On : August 30, 2019 / 04:18 AM IST
చీమ చిటుక్కుమన్నా పట్టేస్తారు : సాగర్ చుట్టూ 250 సీసీ కెమెరాలు

హైదరాబాద్ అనగానే చార్మినార్ తర్వాత గుర్తొచ్చేది హుస్సేన్‌సాగర్, సాగర్ లోని బుద్దుడి విగ్రం, బిర్లా టెంపుల్. ఇవి బాగా ఫేమస్ అయినవి. ఎంతోమంది వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి హైదరాబాద్ అందాలను తిలకిస్తుంటారు. ప్రధానంగా హుస్సేన్ సాగర్‌ను చూసేందుకు భారీగా పర్యాటకులు తరలి వస్తుంటారు. నగరంలో నివాసం ఉంటున్న వారు..వీకెండ్, సెలవు రోజుల్లో సాగర్ అందాలను చూసేందుకు..అందులో బోట్ షికారు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే..ఈ ప్రాంతంలో పటిష్ట బందోబస్తు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

HMDA(హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ), BPPA (బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అథార్టీ) ఇందుకు ప్రణాళికలు సిధ్దం చేస్తోంది. బీపీపీఏ ఓఎస్డీగా అదనపు బాధ్యతలు చేపట్టిన హెచ్ఎండీఏ కార్యదర్శి రాం కిషన్ ఆధ్వర్యంలో బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అథార్టీ కింద ఉండే..ప్రాంతాల్లో సరికొత్త మార్పును తీసుకొచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. 
ప్రజల భద్రతను పరిగణలోకి తీసుకున్న రాం కిషన్..సాగర్ చుట్టూ రూ. 3 కోట్ల వ్యయంతో 250 సీసీ కెమెరాలు బిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏ ప్రాంతంలో ఏమి జరిగినా..క్షణాల్లో తెలిసిపోతుంది. 

హెచ్ఎండీఏలో ప్రత్యేక విభాగమైన బీపీపీఏ 902 హెక్టార్లలో విస్తరించి ఉంది. దీనికింద లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్కు, పీవీ జ్ఞాన్‌తో పాటు హుస్సేన్ సాగర్ కూడా ఉంది. ఇక్కడ అడపదడపా పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రేమ జంటలు రెచ్చిపోవడం లాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. వివిధ కారణాలతో మనస్థాపానికి గురై కొంతమంది ఆత్మహత్య చేసుకొనేందుకు సాగర్ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. 

వీఐపీ కదలికలు ఎక్కువగా ఉండడం..వాహన రాకపోకలు కూడా అంతేస్థాయిలో ఉండే సాగర్ చుట్టూ కెమెరాలు త్వరితగతిన బిగించే దిశగా చర్యలు చేపట్టారు. కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల లేక్ పోలీసుల పని తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. 
Read More : 71 రోజులు..121 మంది రుత్విక్కులు : దేశ భద్రత కోసం మహా యాగాలు