మంగళసూత్రాలు తెంపుకెళ్తున్నారా..? అమ్మాయిలను టీజ్ చేస్తున్నారా..? బీ కేర్‌ఫుల్…పోలీసులు తాట తీస్తారు, హైదరాబాద్‌లో గల్లీగల్లీలో నిఘా నేత్రాలు

10TV Telugu News

cc cameras : మహిళల మెడలో మంగళసూత్రాలు తెంపుకెళ్తున్నారా..? అమ్మాయిలను టీజ్ చేస్తున్నారా..? పబ్లిక్‌గా పోకిరీలు రెచ్చిపోతున్నారా..? దాదాగిరి చేస్తూ బెదిరింపులకి దిగుతున్నారా..? అయితే ఖాకీలు మీ తాట తీయడం ఖాయం. హైదరాబాద్‌లో గల్లీగల్లీకి నిఘా నేత్రాలు వచ్చేస్తున్నాయి. సిటీలో మీరేం చేసినా వాచ్ చేయబోతున్నాయి సీసీ కెమెరాలు . బీ ఆలర్ట్‌..

కిడ్నాప్స్‌, మిస్సింగ్స్‌, స్నాచింగ్స్‌ ఏదైనా ఎప్పుడైనా.. వాచ్‌ డాగ్‌లా క్యాప్చర్‌ చేసే కెమెరాలు వచ్చేస్తున్నాయ్.. లక్షలకొద్ది సీసీ కెమెరాలతో నిఘా నీడలో హైదరాబాద్‌.. పార్కులు, బస్తీ దవాఖానాలు, మోడల్ మార్కెట్లు..

నగర పౌరుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు:
అవును.. నగర పౌరుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ ప్రభుత్వం ఆదేశించడంతో జిహెచ్ఎంసి చర్యలకు సిద్ధమైంది. కార్పొరేషన్ నిర్వహించే కార్యాలయాలు, పార్కులు, బస్తీ దవాఖానాలు, మోడల్ మార్కెట్లు, బస్తీ గల్లీలతో పాటు శివారు ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌తో సమన్వయంతో చేసుకుంటూ సిటిజన్ సేఫ్టికి పెద్దపీట వేయబోతోంది జీహెచ్‌ఎంసీ.

పూర్తిస్థాయి భద్రతతో పాటు పౌరుల రక్షణకు పెద్దపీట:
ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో పూర్తిస్థాయి భద్రతతో పాటు పౌరుల రక్షణకు పెద్దపీట వేయబోతోంది ప్రభుత్వం. ఈ మధ్యే పబ్లిక్‌ సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీపై మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు. పోలీస్‌ శాఖ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ, మెట్రోరైల్‌, సౌత్ సెంట్రల్ రైల్వే లాంటి విభాగాలు తమ పరిధిలో సీసీటీవీ సర్వైలెన్స్ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో నెల రోజుల వ్యవధిలో సీసీ కెమెరాలు లేని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసే దిశగా GHMC వేగంగా అడుగులు వేస్తోంది.

పోలీస్ శాఖ ఫైనలైజ్ చేసిన ఎన్ ప్యానల్డ్ ఎజెన్సీల నుంచి ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లోని డిప్యూటి కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు.. అర్బన్ ఫారెస్ట్ విభాగం.. యూసీడీ అధికారులు తమ విభాగాలకు చెందిన ప్రాంతాల్లో సర్వైలెన్స్ కెమెరాలు ఎక్కడ ఏర్పాటు చేయాలనేది గుర్తిస్తారు. ఇందుకు సంబంధించిన నివేదికను కమిషనర్‌ అందిస్తారు. అధికారుల ఆదేశాలకు తగినట్టుగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. స్పాట్..

సీసీ కెమెరాల సంఖ్య 8లక్షలు పెంచాలని ఆలోచన:
ఇప్పటివరకూ హైదరాబాద్‌లో దాదాపు 4 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయి. వీటి సంఖ్య రెట్టింపు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. మరోవైపు పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు కూడా.. ప్రజల్లో చైతన్యం పెంచుతున్నారు. మరింత ఎక్కువగా కాలనీలు, నివాస సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రయత్నిస్తున్నారు. నిఘా నియంత్రణలో వీటి ప్రాముఖ్యతను చాటి చెబుతున్నారు. సీసీ కెమెరాల సంఖ్య పెరిగితే.. ఎక్కడేం జరిగినా పోలీసులు అక్కడికి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. దీంతో నేరాలు తగ్గే అవకాశం ఉంటుంది. నేరగాళ్లు ఏదైనా చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి ఉంటుంది. లక్షలకొద్ది సీసీ కెమెరాలు అందుబాటులోకి వస్తే నగరవాసికి పూర్తిస్థాయి సేఫ్టీ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

10TV Telugu News