మండలి ఎన్నికల లీవు : అందరికీ కాదు..వారికే

  • Published By: madhu ,Published On : March 14, 2019 / 03:20 AM IST
మండలి ఎన్నికల లీవు : అందరికీ కాదు..వారికే

కొద్ది రోజుల్లో మండలి ఎన్నికలు జరుగనున్నాయి. మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రులు / ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గాలతో పాటు వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గానికి మార్చి 22వ తేదీన ఎన్నికలు జరుగున్నాయి. ఓటు వేయనున్న ఓటర్లకు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్ కుమార్ మార్చి 13వ తేదీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Read Also : యుద్ధానికి సేనాని సిద్ధం : పవన్ కళ్యాణ్ సమర శంఖం

ఓటు హక్కు కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రైవేటు ఉద్యోగులు పోలింగ్ రోజు ఓటు వేసేందుకు విధి నిర్వాహణలో ప్రత్యేక సడలింపులు కల్పించాలని ఆయా సంస్థల యాజమాన్యాలకు రజత్ కుమార్ సూచించారు. ఓటు వేసి కార్యాలయానికి ఆలస్యంగా విధులకు వచ్చినా వారిని అనుమతించాలని, అవసరమతై వారి వారి షిప్టుల సమయాన్ని సర్దుబాటు చేసే విధంగా చూడాలన్నారు. మండలి ఎన్నికలు జరుగనున్న 25 జిల్లాల్లో ఈ ఉత్తర్వులు అమలుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను సీఈఓ రజత్ కుమార్ ఆదేశించారు.