బీ అలర్ట్  : హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

  • Published By: madhu ,Published On : October 9, 2019 / 03:04 AM IST
బీ అలర్ట్  : హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

నగరంలో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 24 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ మోస్తరు నుంచ భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. అత్యవసరమైతే తప్ప ఇళ్లో నుంచి బయటకు రావొద్దని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. భారీ వర్షాలు పడడమే కాకుండా అక్కడక్కడ పిడుగులు పడుతాయన్నారు. 

ఇప్పటికే నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు ఆలస్యంగా వెళ్లడం..ఉపరితల ఆవర్తనం కారణంగా పడుతున్న వర్షాలతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణం కంటే ఎక్కువ శాతం వర్షపాతం నమోదవుతోంది. చినుకు పడితే చిత్తడి అవుతోంది. రహదారులపై భారీగా నీరు చేరుతుండడంతో వాహనదారులు, పాదచారులు ఇక్కట్లు పడుతున్నారు.

ఓ వైపు విష జ్వరాలు వ్యాపిస్తుండడంతో నగర ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దసరా పండుగ అక్టోబర్ 08వ తేదీ మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఒక్కసారిగా వాతవరణంలో మార్పులు చోటు చేసుకోవడం..నిమిషాల్లోనే భారీ వర్షం పడడంతో ప్రజలు తిప్పలు పడ్డారు. తాజాగా భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరించడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. 
Read More : అక్టోబర్ 10న దత్తన్న అలయ్ బలయ్