Metro Rail : హైదరాబాద్ నగరవాసులకు షాక్, మెట్రో రైలు సమయాల్లో మార్పులు

నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. లాస్ట్ మైలు నుంచి రాత్రి 7.45 గంటల వరకే చివరి మెట్రో రైలు నడపనున్నట్లు తెలిపారు. అలాగే చివరి స్టేషన్ ను రాత్రి 8.45 నిమిషాలకు మెట్రో చేరుకోనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం

Metro Rail : హైదరాబాద్ నగరవాసులకు షాక్, మెట్రో రైలు సమయాల్లో మార్పులు

Hyderabad Metro Rail

Metro Rail : తెలంగాణలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ ఎఫెక్ట్ మెట్రో రైలు ప్రయాణికులపై పడింది. నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. లాస్ట్ మైలు నుంచి రాత్రి 7.45 గంటల వరకే చివరి మెట్రో రైలు నడపనున్నట్లు తెలిపారు. అలాగే చివరి స్టేషన్ ను రాత్రి 8.45 నిమిషాలకు మెట్రో చేరుకోనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం ఇవాళ్టి(ఏప్రిల్ 20,2021) నుంచి ఈ నెల 30 తేదీ వరకు అమల్లో ఉండనున్నట్లు తెలిపారు. యథావిధిగా మొదటి రైలు ఉదయం 6.30 గంటల నుంచి అందుబాటులో ఉండనుంది. ప్రయాణికులు కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని.. మాస్కు, శానిటైజర్లు వాడాలని మెట్రో అధికారులు సూచించారు.

కాగా, నగరంలో చాలామంది మెట్రో రైలుని వినియోగిస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు మెట్రోని ఆశ్రయిస్తున్నారు. మెట్రో ప్రయాణం ద్వారా సమయం బాగా ఆదా అవుతుంది. అయితే, నైట్ కర్ఫ్యూ రూపంలో వారికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి.

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాను నియంత్రించేందుకు రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించింది. తెలంగాణలో ఈరోజు(ఏప్రిల్ 20,2021) నుంచి నైట్ కర్ఫ్యూ అమలవుతుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది. ప్రజలు తప్పనిసరిగా ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 30 వరకు ఈ నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.

అన్ని కార్యాలయాలు, సంస్థలు, దుకాణాలు, వ్యాపారాలు, రెస్టారెంట్లు రాత్రి 8 గంటలకే మూసివేయాలి. అత్యసవర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు, మందుల దుకాణాలు, అత్యవసర సేవలందించే వాటికి మినహాయింపు ఉంటుంది.

ఈ కర్ఫ్యూ నుంచి మీడియా, పెట్రోల్ బంకులు, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసులు, ఈ-కామర్స్ సర్వీసులు, మెడికల్ షాపులకు మినహాయింపులు ఇచ్చింది ప్రభుత్వం. ఇక నైట్ కర్ఫ్యూ కారణంగా బార్లు, క్లబ్బులు, వైన్స్, షాపింగ్ మాల్స్ రాత్రి పూట మూతపడనున్నాయి.