హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పులు

హైదరాబాద్‌ మెట్రో రైళ్ల వేళల్లో స్వల్ప మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

  • Published By: veegamteam ,Published On : December 15, 2019 / 02:50 AM IST
హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పులు

హైదరాబాద్‌ మెట్రో రైళ్ల వేళల్లో స్వల్ప మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్‌ మెట్రో రైళ్ల వేళల్లో స్వల్ప మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న పాత సమయాలనే అములు చేయనున్నట్లు వెల్లడించిన అధికారులు…ఉదయం వేళల్లో మాత్రం స్వల్ప మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. కొత్త సమయాలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. 

ఉదయం 6 గంటల 30 నిమిషాలకు మెట్రో మొదటి రైలు ఆయా స్టేషన్ల నుంచి బయలుదేరింది. ప్రారంభ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 11 గంటలకు బయలుదేరి 11 గంటల 50 నిమిషాలకు చివరి స్టేషన్‌కు చేరుకుంటాయని అధికారులు తెలిపారు.

ఆర్టీసీ సమ్మె కాలంలో మెట్రో రైలు సేవలు అమోఘం. సమ్మె కాలంలో ఉదయం 5 గంటల నుంచి మెట్రో రైళ్లు ప్రారంభం అయ్యాయి. మూడు నిమిషాలకు ఒక రైలు చొప్పున ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటలకు వరకు మెట్రో రైళ్లను నడిపారు. ప్రతి రోజు లక్ష మంది మెట్రోలో ప్రయాణించారు.